తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డులో ఉద్యోగాలు..?

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. హైదరాబాద్‌ లోని లక్డీకపూల్‌ లో ఉన్న పోలీస్ నియామక మండలి ఈ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం గమనార్హం. మొత్తం 151 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఆగష్టు 11వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగష్టు 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.tslprb.in/ […]

Written By: Kusuma Aggunna, Updated On : August 1, 2021 4:11 pm
Follow us on


తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. హైదరాబాద్‌ లోని లక్డీకపూల్‌ లో ఉన్న పోలీస్ నియామక మండలి ఈ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం గమనార్హం. మొత్తం 151 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఆగష్టు 11వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగష్టు 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

https://www.tslprb.in/ వె బ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 151 ఉద్యోగ ఖాళీలలో మల్టీ జోన్ – 1లో 68 పోస్టులు ఉండగా మల్టీ జోన్2లో 83 పోస్టులు ఉన్నాయి. ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం జులై 1 నాటికి 34 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి.

రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పరీక్ష రెండు పేపర్లలో ఉండగా ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు చొప్పున 100 మార్కులకు మొదటి పేపర్, డిస్క్రిప్టివ్‌ విధానంలో రెండో పేపర్ ఉంటుంది. రెండో పరీక్ష కూడా 100 మార్కులకు ఉండటం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.54,220 నుంచి 1,33,630 వరకు వేతనం లభించే అవకాశాలు ఉంటాయి.

ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా అప్లికేషన్‌ ఫీజు 1500 రూపాయలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉంది.