మనలో చాలామంది ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్లు జాబ్ ఇంటర్వ్యూలకు వెళుతూ ఉంటారు. అయితే ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు ఉన్నా కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికి ఎంపిక కాకుండా ఉంటాము. అయితే చాలా కంపెనీలు ఉద్యోగాలకు వచ్చిన అభ్యర్థుల ప్రవర్తనను ఆధారంగా చేసుకొని ఉద్యోగాలు ఇస్తూ ఉంటాయి. మన ప్రవర్తనలో లోపాలు ఉన్నా చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: పిల్లలు ఎత్తు పెరగడం కోసం పాటించాల్సిన చిట్కాలివే..?
ఇంటర్వ్యూకు వెళ్లిన సమయంలో, జాబ్ కు ఎంపికైనా తరువాత కూడా కంపెనీలో చిన్న ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి వరకు అందరికీ ఒకే తరహా గౌరవం ఇవ్వాలి. ఇంటర్వ్యూకు వెళ్లే సమయంలో డ్రస్ విషయంలో, బాడీ లాంగ్వేజ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రెజ్యూమ్ లో పొందుపరిచిన అంశాల గురించి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఇంటర్వ్యూకు వెళ్లేముందు కంపెనీ గురించి పూర్తి అవగాహన ఉండాలి.
కంపెనీలో తెలిసిన వాళ్లు ఉంటే అక్కడి వర్క్ కల్చర్, ఇతర విషయాల గురించి అవగాహన ఏర్పరచుకుంటే మంచిది. ఇంటర్వ్యూలో వీలైనంత వరకు నిజాయితీగా ఉండేలా కనిపించాలి. మనకు తెలియని ప్రశ్నలకు ఇష్టం వచ్చిన జవాబులు ఇవ్వకపోవడమే మంచిది. కంపెనీలో ఉద్యోగం ఇస్తే కంపెనీ అభివృద్ధి కోసం మన వంతు మనం కష్టపడతామనే నమ్మకాన్ని అవతలి వ్యక్తుల్లో కలిగించాలి.
Also Read: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.10 వేలు కడితే 16 లక్షలు..!
మనం వ్యక్తిగతంగా ఎలా ఉన్నా పనిలో మాత్రం పూర్తి న్యాయం చేస్తామనే నమ్మకాన్ని అవతలి వ్యక్తులకు కలిగించాలి. కంపెనీకు గతంలో ఇంటర్వ్యూకు హాజరైన వ్యక్తుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి.