మనలో చాలామంది ఒక బ్యాంకులో అకౌంట్ ఉన్నా మెరుగైన సర్వీసులు లభిస్తాయని తెలిస్తే మరో బ్యాంకులో కూడా అకౌంట్ తెరవడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో చాలామంది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్యాంకుకు వెళ్లాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇంటి దగ్గరి నుంచే సులభంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశాన్ని పలు బ్యాంకులు కల్పిస్తున్నాయి.
Also Read: జాబ్ ఇంటర్వ్యూకు వెళుతున్నారా.. చేయకూడని తప్పులివే..?
ఆన్ లైన్ లోనే నిమిషాల్లో బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయాలనుకునే కస్టమర్లు నిమిషాల్లోనే సులభంగా అకౌంట్ ను ఓపెన్ చెయ్యవచ్చు. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు పలు బ్యాంకులు బ్యాంకుకు వెళ్లకుండానే అకౌంట్ తెరిచే అవకాశం కల్పిస్తున్నాయి. యోనో యాప్ ద్వారా ఎవరైనా ఎస్బీఐ అకౌంట్ ను సులువుగా ఓపెన్ చేయవచ్చు.
ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే సులభంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం సాధ్యమవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు సైతం ఆన్‌లైన్ డిజిటల్ సేవింగ్ ఖాతా సర్వీసులను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ద్వారా సులభంగా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇందుకోసం అవసరం అవుతుంది.
Also Read: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.10 వేలు కడితే 16 లక్షలు..!
కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా కస్టమర్లకు ఆన్ లైన్ లో అకౌంట్ ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ జీరో బ్యాలన్స్ అకౌంట్ కావడం గమనార్హం. ఐసీఐసీఐ ఇన్‌స్టా సేవ్ మైన్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. సంబంధిత బ్యాంక్ వెబ్ సైట్ లకు వెళ్లి ఈ అకౌంట్ లు ఓపెన్ చేయడానికి అవసరమైన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.