https://oktelugu.com/

పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.10 వేలు కడితే 16 లక్షలు..!

మనలో చాలామంది డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి రకరకాల మార్గాలను వెతుక్కుంటూ ఉంటారు. అయితే రిస్క్ ఎక్కువగా ఉన్న స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వచ్చే ఛాన్స్ కంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాంకులు, పోస్టాఫీస్ లలోని స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం ఖచ్చితమైన లాభాలను సులువుగా పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా డబ్బులు దాచుకుని ఖచ్చితమైన లాభం పొందవచ్చు. Also Read: జాబ్ ఇంటర్వ్యూకు వెళుతున్నారా.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 23, 2020 / 08:43 AM IST
    Follow us on


    మనలో చాలామంది డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి రకరకాల మార్గాలను వెతుక్కుంటూ ఉంటారు. అయితే రిస్క్ ఎక్కువగా ఉన్న స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వచ్చే ఛాన్స్ కంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాంకులు, పోస్టాఫీస్ లలోని స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం ఖచ్చితమైన లాభాలను సులువుగా పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా డబ్బులు దాచుకుని ఖచ్చితమైన లాభం పొందవచ్చు.

    Also Read: జాబ్ ఇంటర్వ్యూకు వెళుతున్నారా.. చేయకూడని తప్పులివే..?

    పోస్టాఫీస్ లలో చాలా స్కీమ్ లు ఉన్నా ఇతర స్కీమ్ లతో పోల్చి చూస్తే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేయడం ఎంతో ఉత్తమం. 100 రూపాయల నుంచి గరిష్ట పరిమితి లేకుండా ఈ స్కీమ్ లో సులభంగా డిపాజిట్ చేయవచ్చు. ఎంతైనా డిపాజిట్ చేసుకునే సౌకర్యం ఉండటం వల్ల మన ఆదాయం, ఖర్చులను బట్టి మిగిలిన ఆదాయాన్ని ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసి కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు.

    రికరింగ్ డిపాజిట్ స్కీమ్ నెలకు 10,000 రూపాయల చొప్పున 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే 10 సంవత్సరాల తరువాత 16.28 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా స్కీమ్ మెచ్యూరిటీ రికరింగ్ డిపాజిట్ మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు కాగా మన అవసరాలకు అనుగుణంగా మెచ్యూరిటీ కాలాన్ని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం పోస్టాఫీస్ లు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లపై 5.8 శాతం వడ్డీని అందిస్తున్నాయి.

    Also Read: బ్యాంక్ కు వెళ్లకుండానే అకౌంట్ తెరిచే ఛాన్స్.. ఎలా అంటే..?

    అయితే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్ చేసే వాళ్లు ప్రతి నెలా ఖచ్చితంగా నగదు డిపాజిట్ చేస్తూ ఉండాలి. ఒక నెల ఇన్వెస్ట్ చేసే మరో నెల ఇన్వెస్ట్ చేయకపోతే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. వరుసగా కొన్ని నెలల పాటు నగదు డిపాజిట్ చేయకపోతే అకౌంట్ క్లోజ్ అవుతుంది.