Telangana DSC: తెలంగాణ డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల.. పరీక్షలు ఎప్పటి నుంచంటే..

డీఎస్సీని సీబీఆర్టీ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా ప్రతీ రోజు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగనున్నాయి. జూలై 18న మొదటి షిఫ్ట్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ పరీక్ష, రెండో షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్ష నిర్వహిస్తారు.

Written By: Raj Shekar, Updated On : June 29, 2024 8:53 am

Telangana DSC

Follow us on

Telangana DSC: తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్ష పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది. జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి.

రెండు షిఫ్టుల్లో పరీక్షలు..
డీఎస్సీని సీబీఆర్టీ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా ప్రతీ రోజు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగనున్నాయి. జూలై 18న మొదటి షిఫ్ట్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ పరీక్ష, రెండో షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇక జూలై 19 నుంచి 22 వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు జరుగుతాయి. జూలై 20న ఎస్జీటీ, సెకండరీ గ్రేట్‌ ఫిజిక్, స్పెషల్‌ ఎడ్యుకేషన్, జూలై 22న స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్, జూలై 24న స్కూల్‌ అసిస్టెంట్‌ బయాలాజికల్‌ సైన్స్, జూలై 26న తెలుగు భాషా పండిత్, సెంకటండీ గ్రేట్‌ టీచర్‌ పరీక్ష, జూలై 30న స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టీస్‌ పరీక్ష నిర్వహిస్తారు.

2.79 లక్షల దరఖాస్తులు..
ఇదిలా ఉంటే.. రాష్ట్రం మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం గత ఫిబ్రవరి 28న డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తు గడువు జూన్‌ 20వ తేదీతో ముగిసింది. మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థుల పరంగా చూస్తే 2 లక్షల వరకు ఉంటారని అంచనా.