Pahalgam Attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో మంగళవారం జరిగిన ఉగ్రదాడి పర్యా టకులను లక్ష్యంగా చేసుకుంది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో 28 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయారు. భద్రతా బలగాలు వారి కోసం విస్తృత గాలింపు చేపట్టాయి, అటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన నేపథ్యంలో దిల్లీలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
Also Read: ఉగ్రవాదుల అడ్డాగా పీఓకే.. అక్కడి నుంచే దాడులు.. దానిని లేపేస్తే సరి!
పాకిస్థాన్ సైన్యం అలర్టు..
ఈ దాడి తర్వాత పాకిస్థాన్ మిలిటరీ కదలికలు ఉద్రిక్తతను మరింత పెంచాయి. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వైమానిక ట్రాకింగ్ స్క్రీన్‌షాట్‌లు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం, కరాచీలోని దక్షిణ ఎయిర్‌కమాండ్ నుంచి పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన విమానాలు లాహోర్, రావల్పిండి సమీపంలోని నూర్ఖాన్ బేస్ వైపు బయల్దేరాయి. ఈ విమానాల్లో లాక్‌హీడ్ సీ–130 హెర్క్యులస్ రవాణా విమానం, ఎంబ్రేయర్ ఫినోమ్ 100 జెట్ వంటివి ఉన్నాయి, ఇవి నిఘా కార్యకలాపాలు, వీఐపీల రవాణా కోసం ఉపయోగపడతాయి. రావల్పిండిలోని నూర్ఖాన్ బేస్ భారత సరిహద్దుకు సమీపంలో ఉండటం గమనార్హం.
పాకిస్థాన్ స్పందన, గత అనుభవాలు
పహల్గాం దాడిపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ స్పందిస్తూ, ఈ ఘటనతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే, 2019 పుల్వామా దాడి గుర్తుకు వస్తోంది, ఆ ఘటనలో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. దానికి ప్రతీకారంగా భారత్ బాలాకోట్‌లో జైషే మహమ్మద్ శిక్షణ శిబిరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తంగా ఉండటం గమనించదగ్గ అంశం. అయితే, ఈ పరిణామాలపై ఇంకా అధికారిక ధ్రువీకరణ రాలేదు.
భవిష్యత్తు ఆందోలనలు
పహల్గాం లాంటి పర్యాటక ప్రాంతంలో జరిగిన ఈ దాడి భారత్‌లో భద్రతా ఆందోలనలను మరింత తీవ్రతరం చేసింది. గతంలో విదేశీ అతిథుల సందర్శన సమయంలోనూ ఇలాంటి దాడులు జరిగిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది, ముఖ్యంగా సైనిక కదలికలు, దాడి ఘటనల నేపథ్యంలో రెండు దేశాలు ఎలా స్పందిస్తాయనేది కీలకంగా మారింది.
Also Read: పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం.. ఉగ్రవాదంపై ఊహించని దెబ్బ కొట్టాల్సిందే