మోదీ సర్కార్ శుభవార్త.. వాళ్లందరూ రూ.10వేలు పొందే ఛాన్స్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ మధ్య కాలంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ సీనియర్ సిటిజన్స్ కు ప్రయోజనం చేకూరే విధంగా మరో ముఖ్య నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధమైందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మోదీ సర్కార్ త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశాలు […]

Written By: Kusuma Aggunna, Updated On : July 21, 2021 8:38 pm
Follow us on

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ మధ్య కాలంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ సీనియర్ సిటిజన్స్ కు ప్రయోజనం చేకూరే విధంగా మరో ముఖ్య నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధమైందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మోదీ సర్కార్ త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.

2019 డిసెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకు ఆమోదం తెలిపినప్పటికీ పార్లమెంట్ లో ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా సీనియర్ సిటిజన్ల ఆర్థిక అవసరాలను తీర్చడంతో పాటు వారికి భద్రత కల్పించనుందని తెలుస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూరనుంది.

ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే మెయింటెనెన్స్ చార్జీల కింద సీనియర్ సిటిజన్లకు 10,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం లభించే అవకాశాలు అయితే ఉంటాయి. మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ మెయింటెనెన్స్ చార్జీని నిర్ణయించగా పిల్లలు లేదా బంధువులు సీనియర్ సిటిజన్లకు మెయింటెనెన్స్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్అండ్ సీనియర్ సిటిజన్స్ చట్టం 2007కు సవరణలు చేసి కేంద్రం ఈ బిల్లును రూపొందించింది.

కేంద్రం సీనియర్ సిటిజన్లు, తల్లిదండ్రులను వదిలేయకుండా ఉంచాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. సీనియర్ సిటిజన్లకు ఈ బిల్లు అమలులోకి వస్తే భారీగా ప్రయోజనం చేకూరనుంది.