https://oktelugu.com/

మీకు అప్పులు పెరిగిపోయాయా.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..?

కరోనా ఆంక్షలు, లాక్ డౌన్ నిబంధనల వల్ల చాలామంది అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యాపారం చేసేవాళ్లకు గతంతో పోలిస్తే ఆదాయ వనరులు తగ్గిపోయాయి. అప్పుల భారం పెరిగిన వాళ్లు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా సులభంగా అప్పులను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. లాక్ డౌన్ వల్ల నష్టపోతున్నా, వ్యాపారం సరిగ్గా జరగకపోయినా, ఆదాయ వనరులు తగ్గిపోయినా అప్పు తీర్చడానికి ఏదో ఒక మార్గం ఎంచుకుంటే మంచిది. ఇలాంటి సమయంలో అప్పులను తీర్చడానికి పర్సనల్ లోన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 21, 2021 / 08:41 PM IST
    Follow us on

    కరోనా ఆంక్షలు, లాక్ డౌన్ నిబంధనల వల్ల చాలామంది అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యాపారం చేసేవాళ్లకు గతంతో పోలిస్తే ఆదాయ వనరులు తగ్గిపోయాయి. అప్పుల భారం పెరిగిన వాళ్లు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా సులభంగా అప్పులను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. లాక్ డౌన్ వల్ల నష్టపోతున్నా, వ్యాపారం సరిగ్గా జరగకపోయినా, ఆదాయ వనరులు తగ్గిపోయినా అప్పు తీర్చడానికి ఏదో ఒక మార్గం ఎంచుకుంటే మంచిది.

    ఇలాంటి సమయంలో అప్పులను తీర్చడానికి పర్సనల్ లోన్ తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సెక్యూర్ లేని అప్పుల వైపు మొగ్గు చూపడం కంటే వ్యక్తిగత రుణాలు తక్కువ వడ్డీకే లభిస్తాయి కాబట్టి ఈ రుణాలపై ఆసక్తి చూపితే మంచిది. సెక్యూర్ లేని లోన్స్ వల్ల అప్పులు పెరగడంతో పాటు వడ్డీ మొత్తం అసలును మించిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. మరోవైపు క్రెడిట్ స్కోరు తగ్గితే బ్యాంకులు బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశాలు ఉంటాయి.

    బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోరును మెరుగుపరచుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వేర్వేరు బ్యాంకుల ప్రయోజనాలను చూసి తక్కువ వడ్డీరేటు ఉన్న బ్యాంకుల నుంచి రుణాన్ని తీసుకోవాలి. వచ్చే రాబడిని బట్టి అప్పు తీసుకుంటే ఇబ్బంది పడకుండా రుణాన్ని చెల్లించవచ్చు. వ్యక్తిగత రుణం వ్యవధి 5 సంవత్సరాల వరకు ఉంటుంది.

    బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవడం ద్వారా వ్యక్తిగత రుణాన్ని తిరిగి చెల్లించడం సాధ్యమవుతుంది. రుణ మొత్తాన్ని ముందుగానే తిరిగి చెల్లించాలనునుంటే అలా చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులను సులువుగా అధిగమించవచ్చు.