తెలంగాణలో అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీలు.. పది అర్హతతో?

ఈ మధ్య కాలంలో అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు అధికారులు నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. మొత్తం 24 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. అశ్వరాపుపేట, దమ్మపేట మండలాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఈ నెల 16వ తేదీన ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉద్యోగ ఖాళీలకు […]

Written By: Kusuma Aggunna, Updated On : July 21, 2021 8:35 pm
Follow us on

ఈ మధ్య కాలంలో అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు అధికారులు నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. మొత్తం 24 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. అశ్వరాపుపేట, దమ్మపేట మండలాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఈ నెల 16వ తేదీన ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి జులై 31వ తేదీ చివరి తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 24 ఉద్యోగ ఖాళీలలో అంగన్‌వాడి టీచర్, మినీ అంగన్ వాడి టీచర్, ఆయా పోస్టులు ఉన్నాయి. అశ్వారావుపేట ప్రాజెక్ట్‌ పరిధిలో మొత్తం 6 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. దమ్మపేట ప్రాజెక్ట్ లో మొత్తం 18 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది.

పెళ్లైన మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి ఈ ఉద్యోగ ఖాళీలకు కనీస విద్యార్హతగా ఉంది. మహిళలు ఎవరైతే స్థానికంగా నివాసం ఉంటారో వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు.

దరఖాస్తు చేసుకున్న మహిళలను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. https://mis.tgwdcw.in/ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.