SECL Recruitment 2021: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ప్రముఖ సంస్థలలో ఒకటైన కోల్ ఇండియా లిమిటెడ్ కు అనుబంధ సంస్థ అనే సంగతి తెలిసిందే. 196 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం గమనార్హం. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. http://secl-cil.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు పదోతరగతిలో ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవం కచ్చితంగా ఉండాలి. 100 మార్కులకు పరీక్ష ఉండగా రాతపరీక్షకు 60 మార్కులు, కంప్యూటర్ టెస్ట్‌కు 40 మార్కులు ఉంటాయి. 2021 సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు మంచి వేతనం లభించనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత పదో తరగతి కావడంతో పోటీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గడంతో ప్రముఖ కంపెనీల నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతున్నాయి.
గ్రేడ్-3 క్లర్క్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.