https://oktelugu.com/

RBI Recruitment 2022: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 14 ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

RBI Recruitment 2022: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా లీగల్‌ ఆఫీసర్‌(గ్రేడ్‌ బి) ఉద్యోగ ఖాళీలతో పాటు మేనేజర్‌(టెక్నికల్‌–సివిల్‌) ఉద్యోగ ఖాళీలను, మేనేజర్‌(టెక్నికల్‌–ఎలక్ట్రికల్‌) ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు లైబ్రరీ ప్రొఫెషనల్‌(అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌) గ్రేడ్‌ ఏ ఉద్యోగ ఖాళీ ఉంది. ఆర్కిటెక్ట్‌ గ్రేడ్‌ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 25, 2022 / 03:43 PM IST
    Follow us on

    RBI Recruitment 2022: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా లీగల్‌ ఆఫీసర్‌(గ్రేడ్‌ బి) ఉద్యోగ ఖాళీలతో పాటు మేనేజర్‌(టెక్నికల్‌–సివిల్‌) ఉద్యోగ ఖాళీలను, మేనేజర్‌(టెక్నికల్‌–ఎలక్ట్రికల్‌) ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు లైబ్రరీ ప్రొఫెషనల్‌(అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌) గ్రేడ్‌ ఏ ఉద్యోగ ఖాళీ ఉంది.

    RBI Recruitment 2022

    ఆర్కిటెక్ట్‌ గ్రేడ్‌ ఏ ఉద్యోగ ఖాళీలను, ఫుల్‌టైం క్యురేటర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.

    Also Read: Railway Jobs: రైల్వేలో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. ఐటీఐ అర్హతతో?

    2022 సంవత్సరం జనవరి 15వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2022 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://www.rbi.org.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.

    Also Read: Jobs: ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?