Sonu Sood Political Entry: తొండ ముదిరి ఊసరవెళ్లి అవుతుందంటారు. అలాగే సామాజిక సేవకుడు, సినీనటుడు సోనూసూద్ ప్రస్తుతం రాజకీయాల వైపు మళ్లుతున్నట్లు తెలుస్తోంది. ఏ ప్రయాణమైనా చివరకు రాజకీయాల్లోకే ఉన్నట్లుగా ఉంది సోనూసూద్ పరిస్థితి. రాజకీయాలంటే తనకు ఇష్టం లేదని చెప్పినా అతడి ప్రయాణం చివరకు రాజకీయాల్లోకి వెళ్లడం చూస్తుంటే అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని అందరు చెబుతున్నా చివరకు అందులోకే దిగుతున్నారు.
సోనూసూద్ దేశవ్యాప్తంగా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇంకా చేస్తున్నారు కూడా. కానీ తనకు ఇష్టం లేకున్నా రాజకీయాల వైపు మళ్లడం ఆలోచించాల్సిందే. రాజకీయాల్లో జరిగే పరిణామాలు వేరేలా ఉంటాయి. దీంతో ఎవరు కూడా అందులో దిగేందుకు మాత్రం సాహసించడం లేదు. ఈ నేపథ్యంలో సోనూసూద్ రాజకీయ ప్రస్థానంపై ఎన్నో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పంజాబ్ లో తన సోదరి మాళవికా సూద్ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మాత్రం చెప్పడం లేదు. తన చెల్లెలుకు మాత్రమే ఓటు వేయాలని చెబుతున్నారు. దీంతో సోనూసూద్ కు సైతం రాజకీయ మచ్చ ఏర్పడనుంది. కానీ వచ్చే రెండేళ్లలో రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నం అవుతానని మాత్రం చెప్పడం కొసమెరుపు. ఈ క్రమంలో సోనూసూద్ రాజకీయ ప్రవేశంపై పలు ఆసక్తికర చర్చలు చోటుచేసుకుంటున్నాయి.
Also Read: Sonu Sood : రాజకీయాల్లోకి వస్తా .. క్లారిటీ ఇచ్చిన కలియుగ కర్ణుడు !
ప్రస్తుతం మోగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తన సోదరికి ఓటు వేయాలని సోనూ అడుగుతున్నారు. అయితే సోనూసూద్ కు రాజకీయ వాసనలు బాగానే వంట బట్టాయని తెలుస్తోంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. రాష్ర్టంలోని ఇతర ప్రాంతాల్లో కూడా సోనూసూద్ తో ప్రచారం చేయించుకోవాలని చూస్తోందనే చర్చ మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.
దీంతో రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన సోనూసూద్ కూడా ఒక్కసారిగా ప్రచారం చేసేందుకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా సోనూసూద్ లో కూడా ఓ గొప్ప మాటల మాంత్రికుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఏదైతే తనకు అక్కర్లేదని చెబుతున్న నేపథ్యంలో ఆయన ప్రచారం చేయడం గమనార్హం.
Also Read: Sonu Sood: సోనూసూద్ ఖాతాలో మరో అరుదైన ఘనత !