National Voters Day 2022: ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు ప్రధానమైనది. నేతలను ఎన్నుకునే క్రమంలో ఓటు ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. నిజమైన ప్రజాస్వామ్య వాదులను ఎన్నుకునేందుకు ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. అందుకే ఓటును నమ్ముకోవాలి. అమ్ముకోకూడదు. ఏ సారాకో, నోటుకో ఓటును అమ్ముకుంటే ఇక అంతే సంగతి. ఓటును ఓటుగానే వేయాలి. డబ్బు పంచే యంత్రంగా చూడకూడదు. మన భవిష్యత్తును తాకట్టు పెట్టుకోకూడదు. ఓటు విలువను గ్రహించాలి. దాంతోనే మంచి నాయకులు వస్తారనే విషయం గుర్తుంచుకోవాలి.

దేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25న ఓటరు దినోత్సవాన్ని నిర్వహించుకోవడం తెలిసిందే. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉంటుంది. అందుకే ఓటరు నమోదు కోసం ఈ రోజు ప్రత్యేకంగా కేటాయించారు. ప్రతి పౌరుడి బాధ్యత స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడమే. మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు ఉపయోగపడుతుంది.
Also Read: లైవ్‌లో జర్నలిస్టును బూతులు తిట్టిన అమెరికా అధ్యక్షుడు.. జోబైడెన్‌కు ఏమైంది?
భారత దేశంలో 1950 జనవరి 25న ఎన్నికల సంఘాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ఈ రోజును ఓటరు నమోదు దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించారు. ప్రతి ఎన్నికల్లో వీరు ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. వారికి గుర్తింపు కార్డులు అందజేస్తారు. ఎన్నికల్లో వారు తమ నేతను ఎన్నుకునే వీలు కల్పిస్తున్నారు. దీంతో ప్రజాస్వామ్యంలో ఓటుహక్కును గౌరవిస్తున్నారు.
2011 జనవరి 25న అప్పటి రాష్ర్టపతి ప్రతిభా పాటిల్ ఓటరు నమోదు దినోత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి విధిగా ఈ రోజును ఓటరు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఓటుహక్కుకు అంతటి ప్రాధాన్యం ఇచ్చిన దేశంగా ఇండియా ఖ్యాతి గడిస్తోంది. యువజనులకు ఓటుహక్కు కల్పించి వారిని ప్రజాస్వామ్యంలో భాగం చేసి దేశ ఔన్నత్యాన్ని పెంచిన ఘనత మనదే.
Also Read: తగ్గేదేలే.. ఏడు భాషల్లో కొత్త మీడియాతో రవిప్రకాష్ రె‘ఢీ’
[…] Also Read: ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కుకు ఉన్న… […]