https://oktelugu.com/

ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగ ఖాళీలు.. ఇంటర్, డిగ్రీ అర్హతతో?

ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 23 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, వాచ్‌మెన్, స్వీపర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగాలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావడం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 14, 2021 / 08:07 AM IST
    Follow us on

    ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 23 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, వాచ్‌మెన్, స్వీపర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

    ఈ ఉద్యోగాలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావడం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. నవంబర్ 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

    నోటిఫికేషన్ లో పేర్కొన్న అడ్రస్ కు దరఖాస్తులను పంపడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సులభంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 8 ఉండగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావడంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఆఫీస్ ఆటోమేషన్ గురించి అవగాహన ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

    రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉండగా ఇంటర పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 12,000 రూపాయలు వేతనం లభించనుంది. ఆఫీస్ సబ్ ఆర్డినేట్ 12 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు 12,000 రూపాయలు వేతనంగా లభించే అవకాశం ఉంటుంది. వాచ్‌మెన్- 1 ఉద్యోగ ఖాళీలకు ఐదో తరగతి అర్హత కాగా 12,000 రూపాయలు వేతనంగా లభించనుంది. స్వీపర్- 1 ఉద్యోగాలకు తెలుగు చదవడం, రాయడం వచ్చిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.apindustries.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తుకు సంబంధించిన అడ్రస్, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.