గత కొన్ని నెలలుగా రైల్వే శాఖలో వరుస జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతుండగా తాజాగా 1785 ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ నెల 15వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా డిసెంబర్ 14వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. వారుఖరగ్‌పూర్, సత్రగచి, చక్రధర్‌పూర్, టాటా, ఝర్సుగూడ, రాంచీ ప్రాంతాలలో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు పని చేయాల్సి ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. అకడమిక్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.
50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులలో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. http://rrcser.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుంది. పదో తరగతి, ఐటీఐ 50 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు ప్రాంతాలలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి.