నిరుద్యోగులకు శుభవార్త.. రూ.75,000 వేతనంతో ఉద్యోగాలు..?

ఓఎన్‌జీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 33 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 21వ తేదీలోగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అయితే ఓఎన్జీసీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఉద్యోగాలలో కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (ఫీల్డ్ డ్యూటీ) […]

Written By: Kusuma Aggunna, Updated On : November 19, 2020 8:50 pm
Follow us on

ఓఎన్‌జీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 33 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 21వ తేదీలోగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

అయితే ఓఎన్జీసీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఉద్యోగాలలో కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (ఫీల్డ్ డ్యూటీ) పోస్టులకు 28 ఖాళీలు ఉండగా కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాలు మూడు ఉన్నాయి. ఇవి కాకుండా కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (ఆక్యుపేషనల్ హెల్త్) 1, కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ పార్ట్ టైమ్) ఒక ఉద్యోగ ఖాళీ ఉంది. https://www.ongcindia.com/ వెబ్ సైట్ లో నోటిఫికేషన్ ను చదివి అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ లోని అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని వివరాలను నమోదు చేసి recruitmentrajahmundry@ongc.co.in వెబ్ సైట్ కు ఈ నెల 21వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు వయస్సుతో సంబంధం లేకుండా ఎంబీబీఎస్‌ పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ చేసి రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ ఫీల్డ్ డ్యూటీ చేసేవాళ్లకు 75,000 రూపాయలు వేతనం కాగా మిగిలిన ఉద్యోగాలకు అర్హతను బట్టి వేతనం ఉంటుంది. దరఖాస్తు చేసేవాళ్లు అప్లికేషన్ ఫామ్ తో పాటు ఫోటోలు, సర్టిఫికెట్లు, అడ్రస్ ప్రూఫ్ లను పంపించాల్సి ఉంటుంది.