
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న మహారత్న సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఏడాది నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతోంది. వరుసగా నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. మొత్తం 280 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజైంది. గేట్ 2021 స్కోర్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఈ నెల 21వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మే 21వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్ 10వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. https://www.ntpc.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగాలకు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. కనీసం 65 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీ యూనిట్లలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు గరిష్టంగా 1,40,000 రూపాయలు వేతనం లభించే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.