
ఇంజ్రాయెల్ రాజధాని అయిన జెరూసలేం తూర్పు భాగంలో ఉన్న టెంపుల్ మౌంట్ తెరుచుకున్నది. ఇజ్రాయెల్ పోలీసుల రక్షణలో 50 మంది యూధు యాత్రికులు మొదటి రోజు సాధారణ తీర్థయాత్రకు అక్కడి చేరుకున్నారు. ఇజ్రాయెల్- పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఆదివారం వరుసగా మూడో రోజు కూడా కొనసాగింది. తమ పవిత్ర స్థలం యూదులకు తెరిచిన మొదటి రోజున ఎలాంటి అవాంతరాలు లేవని, ప్రశాంతంగా యాత్ర కొనసాగిందని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు.