https://oktelugu.com/

Singareni Jobs: సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. అర్హులు వీరే..!

నోటిఫికేషన్‌లో ప్రకటించిన పోస్టుల ప్రకారం.. అభ్యర్థులకు బ్రాంచ్‌/ట్రేడ్‌లో ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 26, 2024 / 06:07 PM IST

    Singareni Jobs

    Follow us on

    Singareni Jobs: దేశంలోని ప్రముఖ బొగ్గు గనుల సంస్థ, తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగాల్లో 327 పోస్టులు భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు విధానం, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం తదితర వివరాలు తెలుసుకుందాం.

    మొత్తం ఖాళీలు 327..
    సింగరేణి సంస్థ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగాల్లో 327 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఈఅండ్‌ఎం)–42 పోస్టులు, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(సిస్టమ్స్‌)–07 పోస్టులు భర్తీ చేస్తారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీర్‌ ట్రైౖ నీ(టీ అండ్‌ ఎస్‌)–100 పోస్టులు, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ(మెకానికల్‌) టీ అండ్‌ ఎస్‌–9 పోస్ట్‌లు, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ(ఎలక్ట్రికల్‌) టీ అండ్‌ ఎస్‌–24 పోస్ట్‌లు, ఫిట్టర్‌ ట్రైౖ నీ–కేటగిరీ–1 47 పోస్ట్‌లు, ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ కేటగిరీ–1 పోస్టులు 98 భర్తీ చేయనున్నారు.

    వీరు అర్హులు..
    నోటిఫికేషన్‌లో ప్రకటించిన పోస్టుల ప్రకారం.. అభ్యర్థులకు బ్రాంచ్‌/ట్రేడ్‌లో ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

    రాత పరీక్ష ద్వారా ఎంపిక…
    ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌ల భర్తీ ప్రక్రియలో ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ, పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను సర్టిఫికెట్‌ వెరిఫికేషన్, మెడికట్‌ టెస్ట్‌కు పిలుస్తారు. ఇందులో పాస్‌ అయిన వారికే నియామక పత్రాలు అందిస్తారు.

    పరీక్ష విధానం ఇదీ..
    ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు సంబంధించి పరీక్ష విదానం వేర్వేరుగా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 200 ప్రశ్నలు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పరీక్షలో 90 ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో సబ్జెక్ట్‌కు సంబంధిత ప్రశ్నలతోపాటు జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ మ్యాథమెటిక్స్, రీజనింగ్, యాంటానిమ్స్, సినానిమ్స్, ఐక్యూ, ఆప్టిట్యూడ్, జనరల్‌ స్టడీస్, న్యూమరికల్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ బేసిక్స్‌ ప్రశ్నలు ఉంటాయి. రెండున్నర గంటల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది.

    వేతనం ఇలా..
    ఇక ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు సాధించిన వారికి ఆకర్షణీయ వేతనాలు ఉంటాయి. పోస్టులను అనుసరించి నెలకు కనీస వేతనం రూ.40 వేల నుంచి ప్రారంభం అవుతుంది. వేతనంతోపాటు టీఏ, డీఏ, ఎల్‌టీసీ, ఏటా బోనస్‌ వంటి సదుపాయాలు ఉంటాయి.