NEET Result 2024: మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యకు సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్స్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ 2024 (NEET UG 2024) ఫలితాలు వచ్చేశాయి. దేశంలో సుమారు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. ఎన్ టీఏ అధికారిక వెబ్‌సైట్ https://neet.ntaonline.in/ నుంచి స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్టీఏ నీట్ యూజీ ఫలితాలను కూడా https://neet.ntaonline.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. స్కోర్లను చెక్ చేసుకోవడానికి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ అవసరం.
5న పరీక్ష..
ఈ ఏడాది మే 5న నీట్ యూజీ పరీక్ష దేశ విదేశాల్లో నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా 557 నగరాల్లోని వివిధ కేంద్రాల్లో 24 లక్షల మందికి పైగా అభ్యర్థులు రాశారు. నీట్ యూజీ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీని మే 29న విడుదల చేయగా.. 2024 జూన్ 1వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఫైనల్ ఆన్సర్ కీని 2024 జూన్ 3వ తేదీన విడుదల చేశారు.
67 మందికి ఫస్ట్ ర్యాంకు..
నీట్ –2024 ఫలితాల్లో దేశ వ్యాప్తంగా 67 మంది మొదటి ర్యాంకు సాధించారు. ఈ సంవత్సరం పరీక్షలో అర్హత మార్కులు పెరిగాయి. ఉదాహరణకు, గత ఏడాది అన్ రిజర్వ్‌డ్ కేటగిరీకి అర్హత మార్కుల పరిధి గతేడాది 720–137 ఉండగా, ఈ ఏడాది 720–164కి పెరిగింది. అదేవిధంగా ఓబీసీ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు గతేడాది 136–107 ఉండగా ఈ ఏడాది 163–129కి పెరిగింది.
ఫస్ట్ క్యాంకు సాధించింది వీరే..
వేద్ సునీల్‌కుమార్ షెండే
సయ్యద్ ఆరిఫిన్ యూసుఫ్ ఎం
మృదుల్ మాన్య ఆనంద్
ఆయుష్ నౌగ్రయ్య
మజిన్ మన్సూర్
రూపయాన్ మండలం
అక్షత్ పంగారియా
శౌర్య గోయల్
తథాగత్ అవతార్
చాంద్ మల్లిక్
ప్రచిత
శైలజ.ఎస్
సౌరవ్
దివ్యాంశ్
గన్‌మే గార్గ్
ఆదర్శ్ సింగ్ మోయల్
ఆదిత్య కుమార్ పాండా
అర్ఘ్యదీప్ దత్తా
శ్రీరామ్.పి
ఇషా కొఠారి
కస్తూరి సందీప్ చౌదరి
శశాంక్ శర్మ
శుభన్ సేన్‌గుప్తా
సాక్షం అగర్వాల్
ఆర్యన్ శర్మ
కహ్కషా పర్వీన్
దేవదర్శన్ ఆర్.నాయర్
గట్టు భానుతేజ సాయి
ఉమైమా మల్బారి
కళ్యాణ్.వి
సుజోయ్ దత్తా
శ్యామ్ ఝన్వర్
ఆర్యన్∙యాదవ్
మానవ్ ప్రియదర్శి
పలాన్షా అగర్వాల్
రజనీష్.పి
ధ్రువ్ గార్గ్
కృష్ణమూర్తి పంకజ్ శివల్
శ్రీనంద్ షర్మిల్
వేద్ పటేల్
సామ్ శ్రేయాస్ జోసెఫ్
జయతి పూర్వజ.ఎం
మనే నేహా కుల్దీప్
హృతిక్ రాజ్
కృతి శర్మ
తైజాస్ సింగ్
అర్జున్ కిషోర్
రోహిత్ ఆర్
అభిషేక్ వి జె
శబరీశన్.ఎస్
దర్శ్ పగ్దార్
శిఖిన్ గోయల్
అమీనా ఆరిఫ్ కడివాలా
దేవేష్ జోషి
రిషబ్ షా
పోరెడ్డి పవన్ కుమార్ రెడ్డి
అభినవ్ సునీల్ ప్రసాద్
సమిత్ కుమార్ సైనీ
ఇరామ్ క్వాజీ
వడ్లపూడి ముఖేష్ చౌదరి
అభినవ్ కిస్నా
ఖుష్బూ
క్రిష్
లక్షయ్
అంజలి
జాన్వీ
ప్రతీక్