https://oktelugu.com/

ఎల్ఐసీ‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌‌లో ఉద్యోగాలు.. 14 లక్షల రూపాయల వేతనంతో..?

ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 20 ఐటీ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. 20 ఉద్యోగాలలో మేనేజ్ మెంట్ ట్రెయినీ ఉద్యోగాలు 9 ఉండగా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు 11 ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలలో గ్రాఫిక్స్ డిజైనర్, మొబైల్ అప్లికేషన్ డెవలపర్, డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్, వెబ్ & డేటా బేస్ డెవలపర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇంజనీర్ ఖాళీలు ఉన్నాయి. https://www.lichousing.com/ వెబ్ సైట్ లో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 20, 2020 / 12:24 PM IST
    Follow us on


    ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 20 ఐటీ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. 20 ఉద్యోగాలలో మేనేజ్ మెంట్ ట్రెయినీ ఉద్యోగాలు 9 ఉండగా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు 11 ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలలో గ్రాఫిక్స్ డిజైనర్, మొబైల్ అప్లికేషన్ డెవలపర్, డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్, వెబ్ & డేటా బేస్ డెవలపర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇంజనీర్ ఖాళీలు ఉన్నాయి.

    https://www.lichousing.com/ వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలలో అసిస్టెంట్ మేనేజర్ల ఉద్యోగాలకు ఎంపికైన వారికి సంవత్సరానికి 10 లక్షల రూపాయల నుంచి 14 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. మేనేజ్ మెంట్ ట్రెయినీల ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు 25 వేల రూపాయలు వేతనంగా పొందవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 31 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

    ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 2020 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నాటికి 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్, ఐటీ సబ్జెక్టులతో డిగ్రీతో పాటు ఏడాది అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్, ఐటీ సబ్జెక్టులలో డిగ్రీతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి.

    ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి 50 మార్కులకు ఆన్ లైన్ టెక్నికల్ టెస్ట్ నిర్వహిస్తారు. 50 మార్కులకు ఈ పరీక్ష ఉండగా మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు ఇంటర్య్వూలకు ఎంపికవుతారు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక కావడం జరుగుతుంది.