https://oktelugu.com/

Jobs: డిగ్రీ క్వాలిఫికేషన్‌తో ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి

డిగ్రీ పూర్తిచేసిఇన అభ్యర్థులు అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్చు చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది. మే 8 వరకు దరఖాస్తు గడువు ఉంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 30, 2024 / 12:25 PM IST

    Jobs

    Follow us on

    Jobs: ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో ఉద్యోగాలు పొందాలంటే.. అవసరమైన విద్యార్హతలు, స్కిల్స్‌ ఉండాలి. అవి లేకపోతే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. ప్రైవేట సెక్టార్‌లో అయితే ఎంచుకున్న రంగానికి అనుగుణంగా నైపుణ్యం పెంచుకోవాల్సిందే. ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రణాళిక ప్రకారం చదవాలి. ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలో అసాధారణ ప్రతిభ కనబర్చాలి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఏపీ ఎకనామిక్స్‌ – స్టాటిస్టికల్‌ సబార్డినేట్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మారిచ 6న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

    డిగ్రీ అర్హతతో..
    డిగ్రీ పూర్తిచేసిఇన అభ్యర్థులు అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్చు చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది. మే 8 వరకు దరఖాస్తు గడువు ఉంది.

    ముఖ్యమైన సమాచారం:
    అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ ఖాళీల సంఖ్య: 05
    అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ (స్టాటిస్టిక్స్‌) లేదా బ్యాచిలర్‌ డిగ్రీ (మ్యాథమెటిక్స్‌/ ఎకనామిక్స్‌/ కామర్స్‌/కంప్యూటర్‌ సైన్స్)లో స్టాటిస్టిక్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

    వయోపరిమితి:
    2024, జూలై 1వ తేదీ నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

    దరఖాస్తు ఫీజు:
    అభ్యర్థులు అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్‌–సర్వీస్‌మెన్‌ అభ్యర్థుల, తెల్లరేషన్‌ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు కల్పించారు.

    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.

    ఎంపిక విధానం:
    ఉద్యోగాల ఎంపికకు రాత పరీక్ష, కంప్యూటర్‌ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

    జీతం:
    ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.37,640– రూ.1,15,500 ఇస్తారు.