Samantha Assets: సమంత దగ్గర ఇన్ని కార్లు ఉన్నాయా..? ఆమె ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?

సమంతకి 'మయోసైటస్' అనే వ్యాధి ఉండడం వల్ల ఆమె షూటింగ్ కి చాలా రోజులు గ్యాప్ ఇస్తూ వస్తుంది. ఇక తను ప్రస్తుతం కొన్ని సినిమాలు కూడా చేస్తుంది.

Written By: Gopi, Updated On : April 30, 2024 12:25 pm

Samantha Ruth Prabhu Assets

Follow us on

Samantha Assets: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నా హీరోయిన్ సమంత.. ఆమె చేసిన సినిమాలు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించి పెట్టాయి. ఇక అందులో భాగంగానే ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంది.

ఇక ఆమె గతంలో నాగచైతన్యని పెళ్లి చేసుకొని ఆయన నుంచి డివోర్స్ తీసుకొని మళ్ళీ సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే… అయితే సమంతకి ‘మయోసైటస్’ అనే వ్యాధి ఉండడం వల్ల ఆమె షూటింగ్ కి చాలా రోజులు గ్యాప్ ఇస్తూ వస్తుంది. ఇక తను ప్రస్తుతం కొన్ని సినిమాలు కూడా చేస్తుంది. రీసెంట్ గా ఆమె బర్త్ డే కావడం వల్ల ఆమె నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాకి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె 115 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నట్టుగా తెలుస్తుంది…

ఇక ఆమె ఒక్క సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. సౌత్ లో నయనతార తర్వాత తనే అంత భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ నటిగా గుర్తింపు కూడా పొందింది. ఇక ఇదిలా ఉంటే తనకున్న బిజినెస్ లు , యాడ్స్ ద్వారా కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఆమె దగ్గర ఖరీదైన కార్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది…

2 కోట్ల 26 లక్షల ఖరీదు చేసే ల్యాండ్ రోవర్ అండ్ రేంజ్ రోవర్ వోగ్

ఒక కోటి 46 లక్షల విలువచేసే పోర్షే కేమాన్…

72 లక్షలు విలువ చేసే జాగ్వర్ ఎక్స్ ఎఫ్

3 కోట్ల 30 లక్షలు విలువ చేసే బెంజ్ జీ 63 ఎ ఏమ్ జీ

87 లక్షల ఆడి క్యూ 7

ఒక కోటి 70 లక్షల బి ఏం డబ్ల్యూ సిరీస్ లా కార్లు ప్రస్తుతం సమంత దగ్గర ఉన్నాయి…

అలాగే హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఇక ముంబైలో 15 కోట్లు విలువచేసే త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ కూడా ఉంది …