https://oktelugu.com/

Jobs: బీఎస్ఎన్‌ఎల్ అదిరిపోయే శుభవార్త.. నెలకు రూ.75 వేల జీతంతో జాబ్స్!

Jobs: ప్రభుత్వ టెలీకాం కంపెనీలలో ఒకటైన బీఎస్ఎన్‌ఎల్ ఎల్ఎల్‌బీ చదివిన వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ఎల్ఎల్‌బీ చదివి 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీనాటికి 32 సంవత్సరాల లోపు వయస్సు, అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. https://bsnl.co.in/ వెబ్ సైట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 13, 2022 / 02:05 PM IST
    Follow us on

    Jobs: ప్రభుత్వ టెలీకాం కంపెనీలలో ఒకటైన బీఎస్ఎన్‌ఎల్ ఎల్ఎల్‌బీ చదివిన వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ఎల్ఎల్‌బీ చదివి 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీనాటికి 32 సంవత్సరాల లోపు వయస్సు, అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.

    https://bsnl.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల 9వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లను అనుభవం ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు.

    ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2 యంగ్ లీగ‌ల్ ప్రొఫెష‌న‌ల్స్ పోస్టుల‌ను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. అర్హత, అనుభవం ఉన్నవాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

    ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభిస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బీఎస్ఎన్‌ఎల్ సంస్థ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ సంస్థ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.