Megastar Chiranjeevi: తనకు ఇండస్ట్రీకి పెద్ద అని పించుకోవడం ఇష్టం లేదని మెగాస్టార్ చిరంజీవి మీడియా ముఖంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజా పరిస్థితులు మాత్రం చిరు చెప్పిన మాటకు, ఆయన చేతలకు ఏం సంబంధం లేదని కుండబద్దలు కొడుతోంది. మొన్నటివరకు ఇండస్ట్రీకి పెద్దగా దాసరి నారాయణరావు గారు ఉండేవారు. ఆయన మరణాంతరం ఇండస్ట్రీలో ఎవరు పెద్దరికం చేస్తారనే అంశంపై జోరుగా చర్చ నడిచింది. చిత్రపరిశ్రమలో ఎవరికైనా సమస్య వచ్చినా, గొడవలు జరిగినా ఆనాడు దాసరి దగ్గరుండి పరిష్కారం చూపారు. ప్రస్తుతం ఆయన లేకపోవడంతో కష్టం వస్తే ఎవరి దగ్గరకు పోవాలనేదానిపై ఎవరికీ క్లారిటీ లేదు.
మా ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచాక ఈ ప్రశ్నను చాలా మంది లేవనెత్తారు. చిరు మాత్రం.. ‘నేను ఇండస్ట్రీ పెద్ద కాదు.. నాకు అవ్వాలని కూడా లేదు.. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోను. కానీ బాధ్యతగా ఉంటా.. ఎవరైనా సాయం కోరితే ముందుండి చేసిపెడతాను.. ఇండస్ట్రీకి అండగా ఉంటా’.. అని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం ఆయన చేతలు మాత్రం ఆయనే ఇండస్ట్రీకి సుప్రీం లీడర్ అనేలా ఉన్నాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: బీఎస్ఎన్‌ఎల్ అదిరిపోయే శుభవార్త.. నెలకు రూ.75 వేల జీతంతో జాబ్స్!
ఇటీవల తెలంగాణలో మూవీ టికెట్ ధరల గురించి ప్రభుత్వానికి ముందుగా చిరునే లేఖ రాశారు. ఆ తర్వాత మిగిలిన వారు స్పందించారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇదే మాదిరిగా ఏపీలో మూవీ టికెట్ ధరల విషయంపై ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించేందుకు మెగాస్టార్ చిరు సిద్ధమయ్యాడు. సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. అయితే, ఇది వ్యక్తిగతమైన భేటీనా లేదా సినీ పరిశ్రమ కోసం చిరు కావాలనే ముందడుగు వేశారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
చిరు కోసమే సీఎం జగన్ తన షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ చేశారని టాక్. వాస్తవ పరిస్థితులు, ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను చిరంజీవి జగన్‌కు వివరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. చిరంజీవి పెద్దరికం కోసం ఈ పని చేయడం లేదని సినీ కార్మికులకు అండగా ఉంటానని మాటిచ్చినందుకే తన బాధ్యత నెరవేరుస్తున్నాడని చిరు వర్గం చెబుతున్న మాట. సినిమా టికెట్ల ధరల విషయంలో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గితే అనధికారికంగా చిరంజీవి ఇండస్ట్రీకి పెద్దన్న అయిపోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: ఆ డెరెక్టర్ వైవాహిక జీవితంలో చిచ్చుపెట్టిన ప్రముఖ హీరోయిన్..!