Omicron Alert: కరోనా వైరస్ వల్ల మన దేశంతో పాటు ఇతర దేశాల ప్రజలు సైతం తీవ్రస్థాయిలో భయాందోళనకు గురవుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి మన దేశంలో ఎక్కువగానే ఉండగా గత కొన్నిరోజుల నుంచి దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే కరోనా ముప్పును తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 11 లక్షలకు పైగా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసులలో ఒమిక్రాన్ కేసులు 5,488 అని సమాచారం. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఎవరైతే ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోలేదో వాళ్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏపీలో ఇప్పటివరకు 61 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 260 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే వ్యాక్సిన్ తీసుకోని వాళ్ల ప్రాణాలకు తీవ్రస్థాయిలో ముప్పు ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు త్వరగా వ్యాక్సిన్ ను తీసుకుంటే మంచిది. కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకుని రెండో డోసు తీసుకోని వాళ్లు సైతం నిబంధనల ప్రకారం సెకండ్ డోస్ ను తీసుకుంటే మంచిది.
రెండు డోసుల కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తక్కువగా ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తర్వాత బాధ పడాల్సి వసుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం గమనార్హం.