ఎక్కడో ఏదో కాలబోతోంది. ఎవరి కొంపనో కూలబోతోంది. దేశ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో అత్యవసరంగా ఢిల్లీలో భేటి అయిన కేసీఆర్ అనంతరం డైరెక్టుగా ఫాంహౌస్ కు చేరుకొని ఏకాంత చర్చలు జరుపుతున్నారు. విశేషం ఏంటంటే తండ్రి ఫాంహౌస్ కు వెళితే హైదరాబాద్ లో అన్నీ చూసుకునే మంత్రి కేటీఆర్ సైతం ఫాంహౌస్ కు వెళ్లడమే రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తండ్రి, తనయుడు ఇద్దరు ఫాంహౌస్ లో ఏకాంత భేటి అయినట్లు సమాచారం. సుధీర్ఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: సీఎంపై అసంతృప్తి గళం విప్పుతున్న నేతలు..!
ఢిల్లీ పర్యటన వివరాలను కేటీఆర్ కు చెప్పడంతోపాటు పార్టీలో అనుసరించాల్సిన విధానాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ ల ఏకాంత భేటితో ఎవరికి ఎలాంటి ఉపద్రవాలు వస్తాయోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అసలు మ్యాటర్ ఏంటనేది ఆసక్తిగా మారింది.
ఢిల్లీ నుంచి రాగానే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తన ఫాంహౌస్ కు వెళ్లారు. అయితే మూడు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో రివ్యూ సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్.. అనంతరం హడావుడిగా ఫాంహౌస్ కు చేరుకోవడం వెనుక మర్మమేమిటి అన్నది ఆసక్తిగా మారింది.
Also Read: జనాలకు కరెంట్ బంద్ చేస్తేనే టీఆర్ఎస్ విలువ తెలుస్తుందట!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేముందు.. సంచలనాలకు నాంది పడే ముందు ఖచ్చితంగా తన ఫాంహౌస్ కు వచ్చి చర్చలు జరుపుతారనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఇరికించే ముందు.. నయీం ఎన్ కౌంటర్.. దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్ సహా కీలక సందర్భాల్లో కేసీఆర్ ఫాంహౌస్ లోనే ఉన్నారన్న ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టే తాజాగా ఢిల్లీకి హడావుడిగా వెళ్లి.. బీజేపీ పెద్దలను కలిసి చర్చించి డైరెక్టుగా ఫాంహౌస్ కు కేసీఆర్ రావడం ఆసక్తి రేపుతోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్