https://oktelugu.com/

Job Offer: అదిరిపోయే ఉద్యోగవకాశం.. రోజుకు 59 వేల జీతం దరఖాస్తుకు కొద్ది రోజులే గడువు!

Job Offer: ప్రస్తుత కాలంలో ఉద్యోగం అనేది ఎంతో అవసరము. మన కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న మన జీవితం సంతోషంగా సాగిపోవాలన్న ఉద్యోగం తప్పనిసరి. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడి చదువుతుంటారు. మరి కొందరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. అయితే తాజాగా ఒక కుటుంబం కూడా ఉద్యోగ ప్రకటన చేశారు. అయితే ఈ ఉద్యోగంలో చేరిన వారికి అక్షరాల రోజుకు 59 వేల జీతం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 27, 2021 / 08:52 AM IST
    Follow us on

    Job Offer: ప్రస్తుత కాలంలో ఉద్యోగం అనేది ఎంతో అవసరము. మన కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న మన జీవితం సంతోషంగా సాగిపోవాలన్న ఉద్యోగం తప్పనిసరి. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడి చదువుతుంటారు. మరి కొందరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. అయితే తాజాగా ఒక కుటుంబం కూడా ఉద్యోగ ప్రకటన చేశారు. అయితే ఈ ఉద్యోగంలో చేరిన వారికి అక్షరాల రోజుకు 59 వేల జీతం.

    Jobs

    వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు ఈ ఉద్యోగం ఏమిటి అనే విషయానికి వస్తే.. యూకే (UK) లోని ఎడిన్‌బర్గ్‌లో నివసిస్తున్నటువంటి ఒక కుటుంబం డిసెంబర్ 22 నుంచి మొత్తం 14 రోజుల వరకు ఈ ఉద్యోగ అవకాశాన్ని కల్పించనున్నారు. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ కావడంతో ఆ కుటుంబం తన పిల్లలను సంరక్షించడానికి కేర్ టేకర్ కావాలని ప్రకటించారు. క్రిస్మస్ సెలవుల్లో భాగంగా కవల పిల్లల సంరక్షణ కోసం ఈ కుటుంబం ఈ ఉద్యోగ ప్రకటన చూశారు .

    Also Read: CDAC Jobs: బీటెక్‌, ఎంసీఏ విద్యార్థులకు శుభవార్త.. 111 ఉద్యోగ ఖాళీలు!

    ఈ ఉద్యోగానికి అర్హత సాధించిన వారి పిల్లలకు స్నానాలు చేయించి వారికి తినిపించడం వారిని నిద్రపుచ్చడం వంటివి చేయాలి. ఇలా చేసిన వారికి ఫుడ్డు బెడ్డుతో పాటు రోజుకు 9 వేల జీతం ఇవ్వనున్నారు. అయితే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారు ఐదు సంవత్సరాల పిల్లలను చూసుకున్న అనుభవం కలిగి ఉండాలి. ఇలా మొత్తం 14 రోజులకు గాను తొమ్మిది లక్షల జీతం అందించనున్నారని ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతోమంది ఆశ్చర్యపోతూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

    Also Read: HAL Recruitment: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?