
ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 65 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలు స్పోర్ట్స్ కోటా ఉద్యోగ ఖాళీలు కాగా https://recruitment.itbpolice.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి పాసై అంతర్జాతీయ క్రీడా పోటీల్లో బహుమతి గెలుచుకున్న వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలన, ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఇతరులకు మాత్రం 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది. రెజ్లింగ్, కరాటే, వుషు, తైక్వాండో, జూడో, జిమ్నాస్టిక్స్ (పురుషులు), స్కీ, బాక్సింగ్, ఆర్చరీ, కబడ్డీ, ఐస్ హాకీ (పురుషులు) కేటగిరీలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి మంచి వేతనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
దేశంలో కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల నిరుద్యోగుల శాతం భారీగా పెరిగింది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ప్రయోజనం చేకూరనుంది.