IPPB recruitment 2021: ఇండియా పోస్ట్ పేమెంట్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 21 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అక్టోబర్ 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.ippbonline.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

2021 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 23 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఆన్ లైన్ టెస్ట్, అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 94,000 రూపాయల నుంచి 2,92,000 వేల రూపాయల వరకు వేతనంగా లభించనుంది. బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవంతో పాటు నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, డిజిటల్ టెక్నాలజీ, ఇంటిగ్రేషన్ అర్కిటెక్ట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ఇతర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం.