పదో తరగతి పాసైన విద్యార్థులకు అలర్ట్.. ఆ పరీక్ష వాయిదా..?

ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పాసైన విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలు కల్పిస్తారనే సంగతి తెలిసిందే. 2008 సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రతిభ గల విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు ఎంపికవుతున్నారు. అయితే ఈ సంవత్సరం కరోనా వైరస్ విజృంభణ వల్ల ఏపీలో పదో తరగతి పరీక్షలను నిర్వహించకపోవడంతో ట్రిపుల్ ఐటీలకు ఎంపిక క్లిష్టంగా మారింది. Also Read: ఇంజనీరింగ్ విద్యార్థులకు గూగుల్ ఇంటర్న్‌షిప్‌.. ఎలా దరఖాస్తు చేయాలంటే..? దీంతో గత […]

Written By: Kusuma Aggunna, Updated On : November 28, 2020 10:08 am
Follow us on


ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పాసైన విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలు కల్పిస్తారనే సంగతి తెలిసిందే. 2008 సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రతిభ గల విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు ఎంపికవుతున్నారు. అయితే ఈ సంవత్సరం కరోనా వైరస్ విజృంభణ వల్ల ఏపీలో పదో తరగతి పరీక్షలను నిర్వహించకపోవడంతో ట్రిపుల్ ఐటీలకు ఎంపిక క్లిష్టంగా మారింది.

Also Read: ఇంజనీరింగ్ విద్యార్థులకు గూగుల్ ఇంటర్న్‌షిప్‌.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

దీంతో గత సంవత్సరాలకు భిన్నంగా ఈ ఏడాది పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం, అధికారులు భావించారు. ముందుగా అనుకున్న ప్రకారం రేపు పరీక్ష జరగాల్సి ఉండగా నివర్ తుఫాన్ ప్రభావం ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షపై పడింది. రాజీవ్ గాంధీ యూనీవర్సిటీ ఆఫ్ నోలెడ్జ్ అన్డ్ టెక్నాలజీస్ కన్వీనర్ హరినారాయణ రేపు రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన ట్రిపు ఐటీ ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.

Also Read: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. రూ.24,000తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..!

రేపు జరగాల్సిన పరీక్ష డిసెంబర్ నెల 5వ తేదీన జరగనుంది. అయితే ఇప్పటికే హాల్ టికెట్లు జారీ అయిన నేపథ్యంలో అవే హాల్ టికెట్లతో విద్యార్థులు అవే పరీక్షా కేంద్రాలలో డిసెంబర్ నెల 5వ తేదీన హాజరు కావాల్సి ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమతో పాటు ఏదో ఒక గుర్తింపు కార్డును తెచ్చుకోవాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాలకు రెండు గంటల ముందే హాజరు కావాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీలలో చేరితే భవిష్యత్తులో సులభంగా ఉద్యోగవకాశాలు లభిస్తాయి. అందువల్ల చాలామంది వీటిలో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలలో చేరిన విద్యార్థులు ఆరు సంవత్సరాలు విద్యను అభ్యసించాల్సి ఉంటుంది.