పోలవరం ప్రాజెక్టుపై ఇంత రగడ కావడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని మంత్రి కన్నాబాబు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014 నాటి అంచనాలనే ఆమోదిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా అడ్డు చెప్పకుండా గత సర్కార్ అంగీకరించిందన్నారు. అర్ధరాత్రి పూటీ ఈ ప్యాకెజీని ఒప్పుకున్నారన్నారు. ఈ తప్పును సరిదిద్దేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఇక నివర్ తుఫాను వల్ల ఇప్పటి వరకు ముగ్గురు మరణించారని మంత్రి తెలిపారు. వరదలో చిక్కకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతుందన్నారు.