నిరుద్యోగులకు శుభవార్త… విశాఖ షిప్ యార్డులో ఉద్యోగాలు..?

హిందూస్తాన్ షిప్‌ యార్డ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్, పర్మినెంట్ ఉద్యోగాల కొరకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. గత కొన్ని నెలలుగా కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టని హిందూస్తాన్ షిప్‌యార్డ్ 26 ఉద్యోగాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Also Read: నిరుద్యోగులకు కాగ్నిజెంట్ శుభవార్త.. ఏకంగా 23,000 ఉద్యోగాలు..? మొత్తం 26 ఉద్యోగాలలో 9 […]

Written By: Navya, Updated On : December 11, 2020 12:09 pm
Follow us on


హిందూస్తాన్ షిప్‌ యార్డ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్, పర్మినెంట్ ఉద్యోగాల కొరకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. గత కొన్ని నెలలుగా కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టని హిందూస్తాన్ షిప్‌యార్డ్ 26 ఉద్యోగాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: నిరుద్యోగులకు కాగ్నిజెంట్ శుభవార్త.. ఏకంగా 23,000 ఉద్యోగాలు..?

మొత్తం 26 ఉద్యోగాలలో 9 ఉద్యోగ ఖాళీలు పర్మినెంట్ కాగా, మిగిలిన 17 ఉద్యోగ ఖాళీలు కాంట్రాక్ట్ కావడం గమనార్హం. https://www.hslvizag.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. హిందుస్తాన్ షిప్ యార్డ్ విడుదల చేసిన ఉద్యోగాల్లో మేనేజర్ ఉద్యోగాలు 6, జనరల్ మేనేజర్ ఉద్యోగాలు 2, అడిషనల్ మేనేజర్ ఉద్యోగం 1 ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగాలలో అసిస్టెంట్ మేనేజర్లు 8, సీనియర్ కన్సల్టెంట్ 3, మెడికల్ ఆఫీసర్లు 2, మేనేజర్లు 2, డిప్యూటీ మేనేజర్ 1, జూనియర్ మేనేజర్ 1 ఉన్నాయి.

Also Read: బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. రూ.40,000 వేతనంతో..?

2021 జనవరి 8వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండగా దరఖాస్తు చేసిన అభ్యర్థులు 2021 జనవరి 16వ తేదీ లోపు హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది. ఐటీ విభాగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులకు 40 ఏళ్ల లోపు ఉండటంతో పాటు కనీసం 9 సంవత్సరాల అనుభవం ఉండాలి. మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

డిగ్రీతో పాటు ఎంబీఏ చేసిన వాళ్లు మేనేజర్ ఉద్యోగాలకు, బీటెక్ చేసిన వాళ్లు టెక్నికల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. చాలాకాలం తర్వాత హిందుస్తాన్ షిప్ యార్డ్ నుంచి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.