ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కస్టమర్లకు షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. 2021 సంవత్సరంలో స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగబోతున్నాయి. చిప్ సెట్ల కొరత పరోక్షంగా స్మార్ట్ ఫోన్ ధరలు పెరగడానికి కారణమవుతున్నట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారి విజృంభణ వల్ల గత కొన్ని నెలల్లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు పెరుగుతున్న పన్నులు, చిప్ సెట్ల కొరతతో కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
Also Read: ఐఫోన్లు కొన్నవారికి గుడ్ న్యూస్.. ఫ్రీగా స్క్రీన్ల రీప్లేస్‌మెంట్..?
ఈ సమస్యల వల్ల టాప్ కంపెనీలు స్మార్ట్ ఫోన్ ధరల పెంపుకే మొగ్గు చూపుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏడాదిలో మూడుసార్లు వేర్వేరు కారణాల వల్ల స్మార్ట్ ఫోన్ల ధరలు పెరగగా మరోసారి ధరలు పెరిగితే వినియోగదారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీలలో ఒకటైన హువావే ఎక్కువ మొత్తంలో చిప్ సెట్లను కొనుగోలు చేయడం వల్ల చిప్ సెట్ల కొరత ఏర్పడినట్టు తెలుస్తోంది.
Also Read: కస్టమర్లకు శుభవార్త.. జియో బడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్స్ విడుదల ఎప్పుడంటే..?
తయారీదారులు చెబుతున్న లెక్కల ప్రకారం స్మార్ట్ ఫోన్ల ధరలు 5 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. రోజురోజుకు స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతుండటం డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో ధరలు భారీగా పెరుగుతున్నాయని సమాచారం. ఒక కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ చైనా కంపెనీ హువావే భారీ ఆర్డర్ వల్ల చిప్ సెట్ల సరఫరా విషయంలో కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. అవసరాలకు సరిపడా చిప్ సెట్లను సమకూర్చుకునే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
చిప్ సెట్లకు గతంతో పోలిస్తే స్పాట్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయడానికి ఖర్చులు పెరగడంతో ఆ భారాన్ని కస్టమర్లపై మోపాలని కంపెనీలు యోచిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఫోన్ల ధరలను ఏకంగా 10 శాతం వరకు పెంచనున్నాయని సమాచారం. కొత్త ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారు వీలైనంత త్వరగా ఫోన్ ను కొనుగోలు చేస్తే అదనపు భారం పడకుండా తప్పించుకోవచ్చు.