
భారత ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 206 ట్రెయినీ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా కోపా, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
జులై 31వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. https://www.hecltd.com/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 206 పోస్టులలో ఎలక్ట్రిషియన్ 20, ఫిట్టర్ 40, మెషినిస్ట్ 16, వెల్డర్ 40, కోపా 48, స్యూవింగ్ టెక్నాలజీ (టైలరింగ్) 42 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
పదో తరగతి ఉత్తీర్ణులై సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. మిగిలిన వారికి 750 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది. వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హతకు తగిన వేతనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. అకడమిక్ మెరిట్ ద్వారా ఎంపిక పక్రియ జరగనున్న నేపథ్యంలో