https://oktelugu.com/

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన గూగుల్.. ఇకపై మూడు రోజులే..?

కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ సాఫ్ట్ వేర్ రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన సంగతి తెలిసిందే. గతంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎంతో అవసరమైతే మాత్రమే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చేవి. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తే అనేక ఇబ్బందులు ఉంటాయని కంపెనీలు భావించేవి. అయితే కరోనా మహమ్మారి విజృంభణ వల్ల కంపెనీలు తమ నిర్ణయాలను మార్చుకుని ఈ ఏడాది మార్చి నుంచి ఉద్యోగులందరీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 15, 2020 / 02:58 PM IST
    Follow us on


    కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ సాఫ్ట్ వేర్ రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన సంగతి తెలిసిందే. గతంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎంతో అవసరమైతే మాత్రమే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చేవి. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తే అనేక ఇబ్బందులు ఉంటాయని కంపెనీలు భావించేవి. అయితే కరోనా మహమ్మారి విజృంభణ వల్ల కంపెనీలు తమ నిర్ణయాలను మార్చుకుని ఈ ఏడాది మార్చి నుంచి ఉద్యోగులందరీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి.

    Also Read: హోం లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్.. లక్షన్నర పన్ను మినహాయింపు..?

    అయితే సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీలలో ఒకటైన గూగుల్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయాలను తీసుకుంటోంది. గతంలో గూగుల్ సంస్థలో పని చేసే ఉద్యోగులకు 2021 సంవత్సరం జూన్ వరకు వర్క్ ఫ్రం హోంను ప్రకటించగా తాజాగా 2021 సంవత్సరం సెప్టెంబర్ వరకు గూగుల్ వర్క్ ఫ్రం ఇస్తున్నట్టు తెలిపింది. మొదట గూగుల్ డిసెంబర్ వరకు వర్క్ ఫ్రం హోంను ప్రకటించగా ఆ తర్వాత గడువును పొడిగించింది.

    Also Read: జియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. కొత్త రకం మోసం..?

    2021 సెప్టెంబర్ తర్వాత ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చినా ఫ్లెక్సిబుల్‌ వ‌ర్క్‌వీక్ విధానం అమలులో ఉంటుంది. ఫ్లెక్సిబుల్‌ వ‌ర్క్‌వీక్ విధానంలో వారంలో మూడు రోజులు ఆఫీస్ లో ఉంటే మిగిలిన మూడు రోజులు ఇంటి నుంచి పని చేయవచ్చు. ఈ విధానాన్ని పరిశీలిస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఫ్లెక్సిబుల్ వర్క్ ద్వారా ఉద్యోగులు మరింత బాగా పని చేస్తారని సుందర్ పిచాయ్ భావిస్తున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఐటీ రంగంలో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. 2021 జనవరి నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండటంతో ఆ తరువాత ఐటీ రంగంలో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని కంపెనీలు భావిస్తున్నాయి.