https://oktelugu.com/

బైడెన్ విజయం అధికారిక ప్రకటన: జనవరి 20న ప్రమాణ స్వీకారం

అమెరికాలో జరిగిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికల్లో జో బైడెన్ గెలుపుపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికాలో ప్రజాస్వామ్యం గట్టి పరీక్షకు గురైందని, అయినా విజయం సాధించిందన్నారు. డెమొక్రట్ల గెలుపుతో ప్రజల అభీష్టం నెరవేరిందన్నారు. చాలా రోజుల క్రితమే ప్రజలు ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించారని, వాటిని ఎవరూ అడ్డుకోలేకపోయారన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ట్రంప్ కోర్టుకు వెళ్లారని, ఇలా వెళ్లడం దేశ చరిత్రలోనే తొలిసారి అన్నారు. కాగా ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికల్లో బైడెన్ 306 […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 15, 2020 / 03:06 PM IST
    Follow us on

    అమెరికాలో జరిగిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికల్లో జో బైడెన్ గెలుపుపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికాలో ప్రజాస్వామ్యం గట్టి పరీక్షకు గురైందని, అయినా విజయం సాధించిందన్నారు. డెమొక్రట్ల గెలుపుతో ప్రజల అభీష్టం నెరవేరిందన్నారు. చాలా రోజుల క్రితమే ప్రజలు ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించారని, వాటిని ఎవరూ అడ్డుకోలేకపోయారన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ట్రంప్ కోర్టుకు వెళ్లారని, ఇలా వెళ్లడం దేశ చరిత్రలోనే తొలిసారి అన్నారు. కాగా ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికల్లో బైడెన్ 306 ఓట్లు సాధించడా ట్రంప్ 232 ఓట్లు సాధించారు. ఓటింగ్ ప్రక్రియ ఫలితాలను వాషింగ్డన్ డీసీకి పంపిస్తారు. జనవరి 6వ తేదీన ప్రస్తుత వైస్ సిడెంట్ మైక్ పెన్స్ అధ్యక్షతన కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో అధికారికంగా లెక్కిస్తారు. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. జనవరి 20వ తేదీన జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు.