AP Degree Jobs: ఏపీ ప్రభుత్వం మహిళా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 22 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీపీఎస్‌సీ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. నవంబర్ 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా డిసెంబర్ 8వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
సంబంధిత విభాగంలో డిగ్రీ చేసిన మహిళలు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. రూ.24,400 నుంచి 71,510 రూపాయల వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎంపికైన వాళ్లకు వేతనంగా చెల్లిస్తారు.
https://psc.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి ఆ తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత యూజర్ ఐడీ జనరేట్ కావడంతో పాటు లాగిన్ అయ్యి పాస్ వర్డ్ ను సెట్ చేసుకోవాలి.
https://psc.ap.gov.in/ వెబ్ సైట్ లో online application submission ఫామ్ పై క్లిక్ చేసి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈ ఉద్యోగ ఖాళీల కొరకు లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉన్నవాళ్లు పోస్టు పేరును సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి దరఖాస్తు ఫారమ్ ను భద్రపరచుకోవచ్చు.
Also Read: ఎస్బీఐ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ.2 లక్షల భీమా?
ప్రముఖ సంస్థలో టీచింగ్ ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.2 లక్షల వేతనంతో?