https://oktelugu.com/

Tollywood:ఈ ఏడాదిలో తెలుగులో వచ్చిన రీమేక్ సినిమాలు ఏవో తెలుసా..?

కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ తీవ్ర కష్టాల్లోకూరుకుపోయింది. దీంతో థియేటర్లోకి సినిమాలు రావడం తక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్లు కొత్త ప్రయోగాలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఇతర భాషల్లో విజయం సాధించిన సినిమాలను రీమేక్ చేసే పనిలో ఉన్నాయి. ఈ ఏడాది కాలంలో తెలుగు ఇండస్ట్రీలో చాలా రీమేక్ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా తమిళం, కన్నడం నుంచి అత్యధికంగా సినిమాలను ఇక్కడి డైరెక్టర్లు రీమేక్ చేశారు. తమిళం, కన్నడం తెలుగు నేటివిటికి దగ్గరంగా ఉండడంతో ఎక్కువగా ఇక్కడి […]

Written By: , Updated On : November 10, 2021 / 09:28 AM IST
Follow us on

కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ తీవ్ర కష్టాల్లోకూరుకుపోయింది. దీంతో థియేటర్లోకి సినిమాలు రావడం తక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్లు కొత్త ప్రయోగాలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఇతర భాషల్లో విజయం సాధించిన సినిమాలను రీమేక్ చేసే పనిలో ఉన్నాయి. ఈ ఏడాది కాలంలో తెలుగు ఇండస్ట్రీలో చాలా రీమేక్ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా తమిళం, కన్నడం నుంచి అత్యధికంగా సినిమాలను ఇక్కడి డైరెక్టర్లు రీమేక్ చేశారు. తమిళం, కన్నడం తెలుగు నేటివిటికి దగ్గరంగా ఉండడంతో ఎక్కువగా ఇక్కడి సినిమాలే రీమేక్ అయ్యాయి. అయితే పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మాత్రం హిందీ నుంచి తీసుకున్నారు.

నారప్ప: విక్టరీ వెంకటేశ్ వెండితెరపైకనిపంచి చాన్నాళ్లు అయింది. మళ్లీ ఆయన నారప్ప సినిమాతో ఎంట్రి ఇచ్చారు. అయితే ఆయన నటించిన నారప్ప మూవీ తమిళంలోని అసురన్ నుంచి తీసుకున్నారు. అక్కడ ధనుష్ హీరోగా నటించారు. అయితే ఈ సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీ వేదికగా విడుదల చేయడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.

వకీల్ సాబ్: మూడేళ్ల గ్యాప్ తరువాత పవన్ కల్యాణ్ సినీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే ‘వకీల్ సాబ్’ సినిమాతో హిట్టు కొట్టాడు. పవన్ కల్యాణ్, అంజలి, నివేదా థామస్, అనన్యలు ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమా హిందీలో ‘పింక్’ రీమేక్. అక్కడ బంపర్ హిట్టు కొట్టడంతో తెలుగులో తీశారు. అయితే ఇక్కడ కూడా ఆ సినిమా విజయం సాధించడం విశేషం.

కపటధారి: సుమంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా కన్నడంలోని ‘కవలదారి’ సినిమా నుంచి తీసుకున్నారు. పోలీస్ కానిస్టేబుల్ క్రైం కేసు ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కన్నడంలో విజయం సాధించింది. అయతే తెలుగులో మాత్రం ఆశించిన విజయం ఫలితం రాలేదు.

తిమ్మరుసు: ఓ కేసు నేపథ్యంలో సాగే తిమ్మరుసు సినిమా ఫర్వాలేదనిపించింద. విభిన్నపాత్రలు పోషించే సత్యదేవ్ హీరోగా వచ్చిన ఈ సినిమాను కన్నడ ‘బీర్బల్ ట్రయోలజీ’ అనే సినిమాకు రీమేక్.

మాస్ట్రో: వరుసగా సినిమాలు చేస్తున్న నితిన్ నటించిన మరో సినిమా ‘మాస్ట్రో’. ఈ సినిమా హిందీ లోని అంధాధూన్ నుంచి తీసుకున్నారు. హిందీలో అంధాధూన్ బ్లాక్ బస్టర్ మూవీ. కానీ తెలుగులో యావరేజ్ గా నడిచింది.

డియర్ మేఘ: కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో మూవీ ‘డియర్ మేఘ’. ఇది అక్కడ ‘దియా’ పేరుతో విజయం సాధించింది. కానీ ఇక్కడ అనుకున్న విజయం లభించలేదు.

ఇష్క్: మలయాళం ఇష్క్ మూవీని అదే పేరుతో తెలుగులో తీశారు. మాస్టర్ మనోజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా యావరేజ్ గానే నడిచింది.