Telugu News » Entertainment » Hero rana fires on a web site due to writing false news on virataparvam movie
Daggubati Rana: ఓ వెబ్ సైట్ పై ఫైర్ అయిన హీరో రానా… నీ సోది అంటూ పోస్ట్
Daggubati Rana: హీరో దగ్గుబాటి రానా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో ” విరాటపర్వం” అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు పెరిగాయి. విరాట పర్వంలో రానా నక్సలైట్‌గా కనిపించనుండగా… సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్‌వీ […]
Daggubati Rana: హీరో దగ్గుబాటి రానా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో ” విరాటపర్వం” అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు పెరిగాయి. విరాట పర్వంలో రానా నక్సలైట్‌గా కనిపించనుండగా… సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
అయితే విరాట పర్వం మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి పలు కారణాల వల్ల తప్పుకున్నారంటూ ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ వెబ్‌సైట్ కూడా అలానే కధనం రాసింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నాడు. అయితే ఈ కధనానికి హీరో రానా స్పందించాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా అహహనం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో “ఎవడు బ్రో నీకు చెప్పింది… నీ సోది” అని రాశాడు రానా.
అయితే రానా ట్వీట్ చేసిన అనంతరం ఆ కథనాన్ని సదరు వెబ్‌సైట్ డిలిట్ చేయడం గమనార్హం. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా… కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. సినిమాలో ‘కోలు కోలు… కోలోయమ్మ’ పాటను కరోనా సెకండ్ వేవ్ కంటే ముందు విడుదల చేశారు. ఆ పాటకు యూట్యూబ్‌లో 11 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా సురేష్ బొబ్బిలి సంగీతం, చంద్రబోస్ సాహిత్యానికి శ్రోతల నుంచి ప్రసంశలు వచ్చాయి.