Good News For Students: చదువుకునే రోజులు పోయి.. చదువు కొనే రోజులు వచ్చాయి. అక్షరం నేర్చుకునే నర్సరీ నుంచే వేల రూపాయలు ఫీజలు వసూలు చేస్తున్యా విద్యా సంస్థలు. ఇక ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ ఫీజులు అయితే లక్షల్లోనే ఉన్నాయి. ఇంజినీరింగ్ కాలేజీలు ఏటా ఫీజులు పెంచుతూ విద్యార్థులపై భారం మోపుతున్నాయి. ఈసారి కూడా ఫీజుల పెంపునకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాయి. ప్రభుత్వం దానిని తిరస్కరించి విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
తెలంగాణలో ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరంలో కూడా గత ఫీజు నిర్మాణంతోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించడం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఊరటనిచ్చే అంశం.
ఫీజుల పెంపు ప్రతిపాదనలపై TAFRC నిర్ణయం
తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) ఈ ఏడాది ఫీజుల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించింది. ప్రైవేట్ కళాశాలలు సమర్పించిన ప్రతిపాదనలు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం, సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఖీఅఊఖఇ ఈ చర్య విద్యా సంస్థలపై నియంత్రణ, పారదర్శకతను కాపాడే దిశగా అడుగుగా చెప్పవచ్చు. దీనివల్ల విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, కళాశాలలు తమ ఆర్థిక నిర్వహణలో మెరుగైన విధానాలను అవలంబించేలా ప్రోత్సహిస్తుంది.
Also Read: Students Studying Abroad : విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు రూ.25 లక్షలు.. ఏపీలో సరికొత్త పథకం
రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్య..
ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఆలస్యమవడం వల్ల కళాశాలలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం 30 మంది సభ్యులతో ఒక ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ ఫెడరేషన్ ద్వారా కళాశాలలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, బకాయిల విడుదలకు కృషి చేయనున్నాయి. ఈ చర్య కళాశాలల ఆర్థిక స్థిరత్వానికి పెంచడంతోపాటు, భవిష్యత్తులో ఫీజుల పెంపు ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంది.
విద్యార్థులకు లభించే ప్రయోజనాలు..
ఫీజుల పెంపు నిలిపివేయడం వల్ల ఇంజినీరింగ్ విద్యార్థులు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినవర్గాల వారు గణనీయంగా లబ్ధి పొందనున్నారు. పాత ఫీజు నిర్మాణం కొనసాగడం వల్ల విద్యా ఖర్చులు అందుబాటులో ఉండి, మరిన్ని కుటుంబాలు తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించగలుగుతాయి. అదే సమయంలో, ఖీఅఊఖఇ నిర్ణయం కళాశాలల నిర్వహణలో జవాబదారీతనాన్ని పెంచుతూ, విద్యా నాణ్యతపై దష్టి పెట్టేలా చేస్తుంది.
Also Read: SSC Students: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. ఇక ఆకలి బాధ తీరినట్లే..!
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల ఆర్థిక భారాన్ని తగ్గించడంతోపాటు, ఇంజినీరింగ్ విద్యా వ్యవస్థలో పారదర్శకతను, నాణ్యతను పెంచే దిశగా ఒక ముందడుగు. అయితే, రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యను త్వరితగతిన పరిష్కరించడం ద్వారా ప్రైవేట్ కళాశాలల ఆర్థిక స్థిరత్వం నిర్ధారించాల్సిన బాధ్యతా ప్రభుత్వంతి ఉంది. ఈ రెండు అంశాల సమతుల్యత విద్యా రంగంలో సుస్థిర అభివృద్ధికి కీలకం. విద్యార్థులకు లభించే ప్రయోజనాలు
ఫీజుల పెంపు నిలిపివేయడం వల్ల ఇంజినీరింగ్ విద్యార్థులు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు గణనీయంగా లబ్ధి పొందనున్నారు. పాత ఫీజు నిర్మాణం కొనసాగడం వల్ల విద్యా ఖర్చులు అందుబాటులో ఉండి, మరిన్ని కుటుంబాలు తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించగలుగుతాయి. అదే సమయంలో TAFRC నిర్ణయం కళాశాలల నిర్వహణలో జవాబదారీతనాన్ని పెంచుతూ, విద్యా నాణ్యతపై దృష్టి పెట్టేలా చేస్తుంది.