Dalit Sarpanch Insult: కాలం మారుతోంది కానీ.. ఇంకా కుల వివక్ష కొనసాగుతోంది. రాజకీయ రిజర్వేషన్లు వచ్చి నిమ్న వర్గాల వారు సైతం ప్రజా ప్రతినిధులుగా మారుతున్నారు. చట్టసభల్లో తమ బలమైన వాయిస్ ను వినిపిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా కర్నూలు జిల్లాలో( Kurnool district) ఓ దళిత సర్పంచ్కు అవమానం జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం నడుస్తోంది. ఒక వీడియోను జత చేస్తూ విపరీతంగా వైరల్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది సరికాదు అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అవమానించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా.. అలా చేసినట్టు మాత్రం ఆ వీడియోలో కనిపించడం లేదు.
ఏడాది పాలన సందర్భంగా..
కూటమి( Alliance ) ఏడాది పాలన ఈనెల 12న పూర్తయింది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదోని మండలం దానాపురంలో గుడి కట్టపై ప్రజల కోసం మీ పార్థసారథి అని పేరుతో ఎమ్మెల్యే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి టిడిపి నాయకురాలు కృష్ణమ్మ కూడా హాజరయ్యారు. సభా వేదికపై ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ సర్పంచ్ ఎక్కడ అంటూ ఆరా తీశారు. సర్పంచ్ రాకపోవడంతో ఆయన ఏమైనా క్రిస్టియనా? అని ఎమ్మెల్యే అనగా.. అక్కడే ఉన్న టిడిపి నేత కృష్ణమ్మ ఎమ్మెల్యే చెవిలో ఎస్సీ అని చెప్పారు. ఇంతలోనే సర్పంచ్ చంద్రశేఖర్ స్టేజి దగ్గరకు వచ్చారు. వారు మాట్లాడుతూ ఉండగా కిందనే నిలబడ్డారు. దీంతో దళిత సర్పంచ్కు అన్యాయం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. విపరీతంగా వైరల్ అవుతుంది ఆ వీడియో.
Also Read: MIM in AP: ఏపీలో మజ్లిస్.. 20 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి నష్టమే!
వైసీపీ నుంచి గెలిచి బిజెపిలోకి..
వాస్తవానికి సర్పంచ్ చంద్రశేఖర్( Sarpanch Chandrashekhar) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపిలో చేరారు. కానీ సొంత పార్టీ సర్పంచును గుర్తించలేని స్థితిలో ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారంటూ సెటైర్లు పడుతున్నాయి. మరోవైపు దళిత సర్పంచులు అవమానించిన ఎమ్మెల్యే పార్థసారథి తో పాటు కృష్ణమ్మలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేసింది. అయితే తాము అవమానం చేయలేదని.. తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేశామని ఎమ్మెల్యే పార్థసారథి చెబుతున్నారు. అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని టిడిపి కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.