women sleep : నిద్ర ప్రతి ఒక్కరికి చాలా అవసరం. చిన్న పిల్లలు ఎంత సేపు పడుకోవాలి? పెద్ద వారు, వృద్ధులు, యూత్ ఇలా ఎవరికి వారికి నిద్ర సమయాలు కూడా సెట్ అయ్యాయి. వాటిని పాటించడం అవసరం. లేదంటే ఎన్నో సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. ఇక కొందరు వర్క్ బిజీలో పడి నిద్రను డిస్ట్రబ్ చేస్తున్నారు. సరైన సమయాన్ని కేటాయించడం లేదు. అయితే నిద్ర లేమి చాలా మందిని ప్రభావితం చేస్తుంది. ప్రతి 3 మందిలో 1 మందికి తగినంత నిద్ర ఉండదు, ముఖ్యంగా మహిళలు ఈ సమస్యతో ఎక్కువ బాధ పడుతున్నారు.
నిద్రలేమి పురుషులు, స్త్రీలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటే.. స్త్రీలలో పురుషుల కంటే 58% ఎక్కువ ప్రాబల్యం ఉందట. స్త్రీ జీవితకాలంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు నిద్ర నాణ్యత, పరిమాణాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి అంటున్నారు నిపుణులు. కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల పీడకలలు వస్తాయి. తరచుగా మేల్కోవడం వంటి సమస్యలు నిద్రకు ఆటంకాన్ని కలిగిస్తాయి. గర్భం కూడా నిద్ర సమస్యలకు దారితీస్తుంది. మొదటి త్రైమాసికంలో నిద్ర నాణ్యత తక్కువగా ఉంటుంది.
మూడవ త్రైమాసికంలో, గర్భిణీ స్త్రీలు రాత్రికి ఐదు సార్లు మేల్కుంటారని అధ్యయనంలో తేలింది. గర్భధారణ సమయంలో తక్కువ నిద్రపోవడం వల్ల పగటిపూట చురుకుదనాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. తల్లి, పిండం ఆరోగ్య ప్రమాదాలను పెంచే అవకాశం కూడా ఉంది. రుతువిరతి నిద్ర భంగం కలిగిస్తుంది. హార్మోన్ల హెచ్చుతగ్గులు, రాత్రి చెమటలు కారణంగా స్త్రీలను ప్రభావితం చేస్తుంది. పెరిమెనోపాజ్ సమయంలో చాలా మంది మహిళలకు రాత్రిపూట చెమటలు పట్టడం, ఆందోళన చెందడం, నిద్ర నాణ్యతను మరింత దిగజార్చడం వంటివి అనుభవిస్తారు.
లింగ-నిర్దిష్ట నిద్ర సవాళ్లను పరిష్కరించడం వల్ల హార్మోన్ల మార్పులను ఎదుర్కొంటున్న మహిళల శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇక నిద్ర చాలా పరిస్థితుల వల్ల ప్రభావితం అవుతుంది కాబట్టి ఈ నిద్ర విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. నిద్రకు ఒక నిద్రిష్టమైన సమయం కేటాయించాలి. ప్రతి రోజు ఒకే సమయానికి నిద్ర పోతే మీ బాడీ అలవాటు పడుతుంది. మీ బెడ్ రూమ్ వాతావరణం కూడా మీ నిద్రను చాలా ప్రభావితం చేస్తుంది. బెడ్ రూమ్ వాతావరణం కూల్ గా ఉండేలా చూసుకోండి. వేడి నీటి స్నానం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది.
బాగా నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. నిద్రలో మెదడు పూర్తిగా విశ్రాంతిని పొందుతుంది. తద్వారా అనవసరమైన జ్ఞాపకాలను చెరిపేస్తుంది నిద్ర. నిద్రలో మీ శరీరం దెబ్బతిన్న కండరాలు, కణజాలాలను రిపేర్ చేస్తుంది అంటున్నారు నిపుణులు. కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. నిద్రలో భావాల్ని కంట్రోల్ చేసుకోవడం సులభం. నిద్రలేమితో బాధపడేవారు ఒత్తిడిని, ఆవేశాన్ని, కుంగుబాటు భావాలతో బాధ పడుతుంటారు.