https://oktelugu.com/

ఏపీ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి గ్రామానికి ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్..?

గతేడాది విజృంభించిన కరోనా మహమ్మారి ప్రజల జీవన విధానాన్ని, ప్రజల ఆలోచనలను పూర్తిగా మార్చిన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి వల్ల వేల సంఖ్యలో ఆఫీసులు మూతబడగా లక్షల సంఖ్యలో ప్రైవేట్ సంస్థలలో పని చేసే ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు. కొత్త ఉద్యోగాల కొరకు ఎదురు చూసే వాళ్లకు ఉద్యోగం దొరకని పరిస్థితి నెలకొంది. పది, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు చదువు విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. Also Read: బ్రేకింగ్: ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 22, 2021 / 07:33 PM IST
    Follow us on


    గతేడాది విజృంభించిన కరోనా మహమ్మారి ప్రజల జీవన విధానాన్ని, ప్రజల ఆలోచనలను పూర్తిగా మార్చిన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి వల్ల వేల సంఖ్యలో ఆఫీసులు మూతబడగా లక్షల సంఖ్యలో ప్రైవేట్ సంస్థలలో పని చేసే ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు. కొత్త ఉద్యోగాల కొరకు ఎదురు చూసే వాళ్లకు ఉద్యోగం దొరకని పరిస్థితి నెలకొంది. పది, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు చదువు విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

    Also Read: బ్రేకింగ్: ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నిమ్మగడ్డ

    చాలామంది విద్యార్థులు ఆన్ లైన్ క్లాసుల ద్వారా పాఠాలను వింటున్నారు. అయితే ఆన్ లైన్ క్లాసుల ద్వారా పాఠాలను వినాలంటే స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. గ్రామాలలో ఉండే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఉన్నా ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇలా విద్యార్థులు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుని జగన్ సర్కార్ వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది.

    Also Read: చంద్రబాబు ‘వ్యూహకర్త’ ప్లాన్లు ఫెయిల్ యేనా?

    ఏపీ సీఎం వైఎస్ జగన్ గ్రామాల్లో ఇంటర్నెట్‌ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్నెట్ లైబ్రరీల సహాయంతో గ్రామాలలోనే వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించాలని అధికారులు జగన్ సూచించారు. ఉన్నతాధికారులతో సమీక్షలో భాగంగా మాట్లాడుతూ సీఎం జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    అన్‌ లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ గ్రామాలలో ఉండాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్నెట్ కోసం ప్రణాళికలు రూపొందించాలని జగన్ తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి అమ్మఒడి చెల్లింపుల టైమ్ కు ల్యాప్ టాప్ ల పంపిణీ జరగాలని.. ల్యాప్ టాప్ లు చెడిపోతే 7 రోజుల్లో గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.