https://oktelugu.com/

కేసీఆర్ కలల ‘ధరణి’కి హైకోర్టు చెక్

సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో భూ వివాదాలకు తావు లేకుండా.. అంతా ఆన్ లైన్ చేస్తూ రూపొందించిన ‘ధరణి’ వెబ్ సైట్ అమలుకు అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పట్లో ధరణిలో భూ రిజిస్ట్రేషన్లు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. Also Read: అఖిలప్రియకు కోర్టులో ఊరట.. తెలంగాణసర్కార్ తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్లపై ఉన్న స్టేను హైకోర్టు పొడిగించింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై గతంలో ఇచ్చిన స్టేను జూన్ […]

Written By: , Updated On : January 22, 2021 / 07:22 PM IST
Follow us on

Telangana High Court

సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో భూ వివాదాలకు తావు లేకుండా.. అంతా ఆన్ లైన్ చేస్తూ రూపొందించిన ‘ధరణి’ వెబ్ సైట్ అమలుకు అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పట్లో ధరణిలో భూ రిజిస్ట్రేషన్లు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

Also Read: అఖిలప్రియకు కోర్టులో ఊరట..

తెలంగాణసర్కార్ తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్లపై ఉన్న స్టేను హైకోర్టు పొడిగించింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై గతంలో ఇచ్చిన స్టేను జూన్ 21కి హైకోర్టు పొడిగించింది. ధరణి పోర్టల్ కు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు ధర్నాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఒకే అంశంపై పలు పిటీషన్లు దాఖలు కావడంతో అందులో ఐదు పిటీషన్లు తోసిపుచ్చి మిగతా రెండింటిని విచారణకు స్వీకరించింది.

ప్రభుత్వం తరుఫున ఏజీ ధరణి వెబ్ సైట్ పై వాదించారు. ధరణిపై అభ్యంతరాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోందని.. ప్రభుత్వ వైఖరి తెలిపేందుకు సమయం కావాలని ఏజీ కోర్టును కోరారు.ఏజీ విజ్ఞప్తిపై స్పందించిన ధర్మాసనం గతంలో ఇచ్చిన స్టేను జూన్ 21 వరకు పొడగిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది.

Also Read: ఒంటరైన దేవినేని.. వైసీపీతో ఫైట్ కు కలిసిరాని నేతలు?

ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల నమోదుకు ప్రజలపై ఎలాంటి ఒత్తిడి తేవొద్దని తెంగాణ హైకోర్టు గతంలోనే  ప్రభుత్వానికి సూచించింది. ధరణి పేరిట ఆస్తుల నమోదు విషయంలో వ్యక్తిగత వివరాలకు ఎలా భద్రత కల్పిస్తారని ప్రశ్నించింది. డేటా దుర్వినియోగం అయితే భద్రతకు విఘాతం కలుగుతుందని అభిప్రాయపడింది. దీనిపై ప్రభుత్వ అడ్వకేట్‌  సమాధానమిస్తూ  డేటా భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కాగా కౌంటర్‌ దాఖలుకు రెండు వారాల గడువు కావాలని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టును కోరారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్