Free Training: తెలంగాణలో భవన నిర్మాణ కార్మికుల పిల్లలను ఆదుకునేందుకు న్యాక్(నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌ష్ట్రక్షన్) ముందుకు వచ్చింది. ఉద్యోగ నోటిఫేషన్లు కష్టంగా ఉన్న ఈ రోజుల్లో స్వయం ఉపాధి(Self Employement)కి ప్రభుత్వాలు కూడా మొగ్గు చూపుతున్నాయి. ఈ తరుణంలోనే దళిత భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ ముందుకు వచ్చింది. నిర్మాణ, పరిశ్రమల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ 1998లో స్థాపించారు. నిర్మాణ పరిశ్రమ నాణ్యత, ఉత్పాదకత పెంచడానికి మానవ వనరుల సామర్థ్యాలను అభివృద్ధి చేయడం, నిర్మించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ కార్యాకలాపాలు నైపుణ్య అభివృద్ధి, నైపుణ్యం మెరుగుదల, అన్నిరకాల మానవ వనరుల భవనాల సామర్థ్యంలో ఉఆ్నయి. ప్రత్యేకంగా నిర్మాణ పరిశ్రమ కోసం ఎన్‌ఏసీ(NAC) ఉద్యోగ యువత, కార్మికులు, వర్తకులు, నిర్మాణ ఇంజినీరర్లు, కాంట్రాక్లరు, మేనేజర్లు, సూపర్‌వైజర్లు సాంకేతిక నిపుణుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి వృత్తి నైపుణ్యం పెంచడానికి శిక్షణలు ఇస్తోంది.
భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు..
తెలంగాణలో దళిత భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ ద్వారా ఉచితాలు, శిక్షణ ఇవ్వనున్నారు. హనుమకొండ జిల్లాకు చెందిన నిచుద్యోగ యువత ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సులు..
హౌస్ వైరింగ్, ల్యాండ్ సర్వే కోర్సుల్లో మూడు నెలల శిక్షణ ఉంటుంది. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులు ఈ శిక్షణ పొందడానికి అర్హులు. శిక్షణకు ఎంపికైన వారితో ఉచిత భోజన సదుపాయం ఉంటుందన్నారు. ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. జిల్లాకు చెందిన విద్యార్థులు మరిన్ని వివరాలకు 9963611239, 9949684763 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.