Homeఎంటర్టైన్మెంట్Allu Sirish Wedding: అల్లు శిరీష్ పెళ్ళిలో అల్లు అర్జున్ ని కలవకుండానే వెళ్లిపోయిన పవన్...

Allu Sirish Wedding: అల్లు శిరీష్ పెళ్ళిలో అల్లు అర్జున్ ని కలవకుండానే వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్..? వీడియో వైరల్!

Allu Sirish Wedding: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు శిరీష్(Allu Sirish), నయనికా(Nayanika) పెళ్ళికి సంబంధించిన ఫోటోలు , వీడియోలే కనిపిస్తున్నాయి. నిన్న హైదరాబాద్ లో వీళ్లిద్దరి పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్ళికి సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులూ , వ్యాపారవేత్తలు , అల్లు కుటుంబానికి దగ్గరైన సన్నిహితులు, మిత్రులు , బంధువులు అందరూ హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరైంది. అందుకు […]

Allu Sirish Wedding: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు శిరీష్(Allu Sirish), నయనికా(Nayanika) పెళ్ళికి సంబంధించిన ఫోటోలు , వీడియోలే కనిపిస్తున్నాయి. నిన్న హైదరాబాద్ లో వీళ్లిద్దరి పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్ళికి సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులూ , వ్యాపారవేత్తలు , అల్లు కుటుంబానికి దగ్గరైన సన్నిహితులు, మిత్రులు , బంధువులు అందరూ హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరైంది. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈ పెళ్ళికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ బిజీ కారణంగా , ఈ పెళ్ళికి ఆయన హాజరు అవుతాడో లేదో అని అంతా అనుకున్నారు. నిన్న అసెంబ్లీ కి హాజరైనప్పటికీ నీరు అక్కడి నుండే పెళ్ళికి వచేసాడు.

Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!

ఆయనతో పాటు సతీమణి అన్నా లెజినోవా , కూతురు పోలిన, రామ్ చరణ్ , ఉపాసన కూడా ఉన్నారు. వీళ్లంతా కలిసే ఈ పెళ్ళికి వచ్చారు. అల్లు శిరీష్ , నయనికా జంటకు మనస్ఫూర్తిగా దగ్గరకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి, వాళ్ళని ఆశీర్వదించి వెళ్లారు. అయితే నిన్న సోషల్ మీడియా లో ఎక్కడా కూడా అల్లు అర్జున్(Icon Star Allu Arjun) , పవన్ కళ్యాణ్ కలిసిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ రాలేదు. దీని పై సోషల్ మీడియా లో విచిత్రమైన గాసిప్ ఒకటి చక్కర్లు కొడుతోంది. అది ఏమిటంటే అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ కలవకుండానే వెళ్లిపోయాడని, అందుకే వీళ్లిద్దరికీ సంబంధించి చిన్న ఫోటో కూడా సోషల్ మీడియా లో రాలేదని అంటున్నారు. చాలా కాలం నుండి అల్లు అర్జున్ , పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా లో పెద్ద యుద్ధమే నడుస్తోంది.

ఆ కారణం చేతనే సోషల్ మీడియా లో కొంతమంది ఈ పుకారుని పుట్టించారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు. అల్లు అర్జున్ , అల్లు అరవింద్ లను పవన్ కళ్యాణ్ ఈ పెళ్లి లో కలిసాడు. వాళ్ళతో కాసేపు ముచ్చటించాడు కూడా. కలిసి ఉన్న ఫోటోలు రానంత మాత్రానా వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం లేదని కాదు. ఉదాహరణకు నిన్నటి పెళ్ళికి చిరంజీవి , రామ్ చరణ్ వచ్చారు. కానీ వాళ్లిద్దరూ కలుసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో రాలేదు. అంత మాత్రానా వీళ్లిద్దరు పెళ్లి ఫంక్షన్ ఎడమొహం , పెడమొహం వేసుకొని ఉన్నారు, ఒకరిని ఒకరు పలకరించుకోలేదు అనుకోవాలా ?, ఎంత సిల్లీ గా ఉంది అలా చెప్తుంటే?, పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ కూడా నిన్న పెళ్ళిలో కలుసుకోలేదు అనేది అంతే సిల్లీ గా ఉందని అంటున్నారు విశ్లేషకులు.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper