Pawan Kalyan : సినిమా అంటే ప్రతి ఒక్కరికి అమితమైన ఇష్టమైతే ఉంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఎన్నో సంవత్సరాల పాటు అవకాశం కోసం ఎదురుచూసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లు మాత్రమే ఇక్కడ స్టార్లుగా రాణిస్తూ ఉంటారు. మిగతావారు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడవచ్చు. మరి మొత్తానికైతే బాలీవుడ్ ఇండస్ట్రీలో 80 వ దశకంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ‘మిథున్ చక్రవర్తి’ (Mithun Chakravarthy) 1986వ సంవత్సరంలో ‘మృగయా’ (Mrugaya) అనే సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆయన నటనకు గాను నేషనల్ అవార్డును కూడా అందుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చాలా అందంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులందరిని తన నటనతో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన 300కు పైన సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ఒక స్టార్ డమ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకే సంవత్సరంలో హీరోగా 19 సినిమాలను రిలీజ్ చేసి గిన్నిస్ బుక్ రికార్డులో తన పేరును నమోదు చేసుకున్నాడు. మరి ఇదిలా ఉంటే ఒకానొక సందర్భంలో ఆయన చేసిన 33 సినిమాలు వరుసగా డిజాస్టర్ లను మూటగట్టుకున్నాయి…
కానీ ఆయన మాత్రం ఎక్కడ నిరాశ పడలేదు. ఇక ఎట్టకేలకు 2007వ సంవత్సరంలో ‘గురు’ (Guru) సినిమాతో ఒక మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. ఇక ఆ సినిమా నుంచి వరుసగా ఇప్పటివరకు మంచి సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. మరి ఏది ఏమైనా కూడా మిథున్ చక్రవర్తి లాంటి నటుడు బాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఒక చెరగని ముద్ర వేశాడనే చెప్పాలి.
ఇక తెలుగులో ఆయన ‘గోపాల గోపాల’ (Gopala Gopala) అనే సినిమాలో దొంగ బాబాగా నటించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) కి కూడా అతని నటన అంటే చాలా ఇష్టమట. అందుకే అతన్ని ఏరీకోరీ మరి గోపాల గోపాల సినిమాలో తీసుకోమని చెప్పారట. పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమైన నటుడు ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని మరి హీరోగా రాణించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలుపెట్టి ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
ఆయన చేసిన ప్రతి పాత్రకి ఆయన జీవం పోస్తూ ఉంటాడు. ఇక ఆయన ఎంటైర్ కెరియర్ లో మూడుసార్లు నేషనల్ అవార్డుని అందుకోవడం అనేది అతనికి ఒక చిరస్మరణీయమైన గుర్తుగా మిగిలిపోయింది. ఇక అలాగే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును కూడా పొందిన అతి కొద్ది మంది నటులలో ఈయన కూడా ఒకరు కావడం విశేషం…