Sai Pallavi : ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువైపోయింది అంటూ చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తూ ఉంటారు. కానీ సాయి పల్లవి లాంటి స్టార్ హీరోయిన్ తనకు నచ్చిన పాత్రలను చేస్తూ హీరోలను సైతం డామినేట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఆమె చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే హీరోయిన్లు సైతం తమకంటూ ఒక స్పెషల్ అటెన్షన్ ని క్రియేట్ చేయడమే కాకుండా హీరోలతో పాటు పోటీపడి నటించడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సాయిపల్లవి(Sai Pallavi) లాంటి నటి చాలా మంచి క్యారెక్టర్లను ఎంచుకుంటూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటేనే ఆమె సినిమా చేస్తుందనే విషయం మనందరికి తెలిసిందే. తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోతే మాత్రం ఆ సినిమాను నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆమె చేసిన ‘ ఫిదా’ సినిమాతో తిరిగి ప్రేక్షకులందరిని మెప్పించింది. ఇక ఈ సినిమాతో మరోసారి సక్సెస్ బాట పట్టిన సాయి పల్లవి కి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమట.ఆయన చేసిన సినిమాల్లో ఒక సినిమా అంటే తనకు విపరీతమైన అభిమానమని సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా కూడా తను తూచా తప్పకుండా చూస్తానని చెబుతుండడం విశేషం…
మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) సినిమాల్లో సాయి పల్లవి కి బాగా నచ్చిన సినిమా ఏంటంటే ‘అత్తారింటికి దారేది'(Attharintiki Daredi)… ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమాని చూడడానికి సాయి పల్లవి చాలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటుందట. అందువల్లే చాలా సందర్భాల్లో ఆమె ఈ సినిమా గురించి కూడా ప్రస్తావించారు.
మరి ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. కాబట్టి ఆమె కూడా తనకు పవన్ కళ్యాణ్ అభిమానిని అంటూ చెబుతుండడం విశేషం….ఇక ఫిదా సినిమాలో కూడా ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించింది. మరి నిజ జీవితంలో కూడా ఆమెకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలనే ఉద్దేశ్యంలో చాలామంది అభిమానులైతే ఉన్నారు. మరి తను పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలు అటు సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అప్పుడే ఆయన కొత్త సినిమాలు కమిటయ్యే అవకాశాలైతే లేనట్టుగా కనిపిస్తున్నాయి…