ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గతంలో లైఫ్ సర్టిఫికెట్ ను అందజేయడానికి రెండు నెలలు గడువు పొడిగించిన కేంద్రం తాజాగా మరో రెండు నెలలు గడువు పొడిగించింది. దీంతో పెన్షనర్లు 2021 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీలోపు ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించవచ్చు. అప్పటివరకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకపోయినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ ను పొందవచ్చు.
Also Read: పదో తరగతి పాసైన విద్యార్థులకు అలర్ట్.. ఆ పరీక్ష వాయిదా..?
ఈపీఎఫ్‌వో తీసుకున్న నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే వారికి ఊరట కలగడంతో పాటు దేశంలోని 35 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. కార్మిక శాఖ నుంచి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది. కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో పెన్షనర్లు సర్టిఫికెట్ ను సమర్పించడానికి ఇబ్బందులు పడకూడదని భావించి ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: పీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఎక్కువ మొత్తం డబ్బులు..?
ఇప్పటివరకు లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించని వారు ఫిబ్రవరి 28వ తేదీలోపు లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పిస్తే సరిపోతుంది. పోస్టాఫీస్ లేదా పెన్షన్ ను పొందే బ్యాంక్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి సులభంగా లైఫ్ సర్టిఫికెట్ ను అందజేయవచ్చు. కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షనర్లు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్ నెలలోపే పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఎవరైతే పెన్షన్ సర్టిఫికెట్ ను సమర్పిస్తారో వారు మాత్రమే పెన్షన్ ను పొందవచ్చు. ఫిబ్రవరి 28వ తేదీలోపు లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించలేకపోతే మాత్రం పెన్షన్ సర్టిఫికెట్ ను పొందడం సాధ్యం కాదు.